Shivaratri : మహాశివరాత్రి వేళ శ్రీశైలంలో అపశ్రుతి
Shivaratri : తెలంగాణలోని లింగాలగట్టు వద్ద శివదీక్ష విరమణ కోసం కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన వారు, పవిత్రస్నానం చేసేందుకు నదిలో దిగారు
- By Sudheer Published Date - 12:45 PM, Wed - 26 February 25

మహాశివరాత్రి (Shivaratri ) బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలంలో విషాదం చోటుచేసుకుంది. పాతాళగంగ వద్ద పుణ్యస్నానం చేయడానికి వచ్చిన ఓ తండ్రి, కుమారుడు ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని లింగాలగట్టు వద్ద శివదీక్ష విరమణ కోసం కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన వారు, పవిత్రస్నానం చేసేందుకు నదిలో దిగారు. అయితే ప్రవాహం తీవ్రంగా ఉండడంతో వారు నీటిలోకి వెళ్లి మరింత లోతులోకి వెళ్లి గల్లంతయ్యారు. స్థానికులు గమనించి మృతదేహాలను వెలికితీసి, పోలీసులకు సమాచారం అందించారు.
Summer Fruits: వేసవిలో దొరికే పుచ్చకాయ,కర్బూజా.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలోని తాడిపూడి వద్ద గోదావరిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. 11 మంది యువకులు గోదావరిలో దిగగా, వారిలో ఐదుగురు గల్లంతయ్యారు. పవన్, దుర్గాప్రసాద్, ఆకాశ్, సాయి, పవన్ అనే యువకుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Shocking : మహాశివరాత్రి వేళ.. శివలింగాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు
ఈ ఘటనల నేపథ్యంలో పవిత్ర నదీ స్నానాల సమయంలో భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో, భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రదేశాల్లో స్నానం చేయడం ప్రమాదకరం కావున, భక్తులు ఆలయ పరిధిలోనే ఏర్పాటైన భద్రతా నిబంధనలు పాటించాలని అధికారుల సూచించారు.