Sri Rama Navami: ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు? తేదీ, శుభ ముహూర్తం వివరాలు ఇవే?
ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది? పూజా సమయం, శుభ ముహూర్తాల గురించి, పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:00 AM, Tue - 1 April 25

ఉగాది పండుగ తర్వాత వచ్చే పండుగ శ్రీరామనవమి. శ్రీరాముని జన్మించిన రోజుని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఈ పండుగ కూడా ఒకటి. కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత వచ్చే రెండవ పండుగ అయిన శ్రీరామ నవమికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రోజు పానకం, వడపప్పు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. 2025 శ్రీరామనవమి ఎప్పుడు, శుభ ముహూర్తం ప్రాముఖ్యతను తెలుసుకుందాం..
ఈ ఏడాది 2025 ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామ నవమిని జరుపుకుంటారు. శ్రీరామ చంద్రుడు ఈ రోజు జన్మించాడని భక్తులు నమ్ముతారు. ఈ రోజు శ్రీరామ చంద్రునితో పాటు దుర్గామాతను కూడా పూజించే సంప్రదాయం ఉంది. ఇళ్ళలో రామాలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. కొన్ని ప్రదేశాలలో సీతారాములకు కల్యాణం కూడా జరిపిస్తారు. ఇకపోతే ఈ ఏడాది అనగా 2025 ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. 2 గంటలు 31 నిమిషాలు. శ్రీరామనవమి మధ్యాహ్న సమయం..ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12:24 నిమిషాలు, నవమి తిథి ఆరంభం.. 2025 ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 7:26 నిముషాలతో ముగిసింది.
నవమి తిథి ముగింపు 2025 ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 7:22 గంటలకు ప్రారంభం అవుతుంది. కాగా చైత్ర మాస శుక్ల పక్ష నవమి తిథి నాడు రామచంద్రుడు జన్మించాడు. ప్రతి సంవత్సరం ఈ రోజును రామచంద్రుని జన్మదినంగా జరుపుకుంటారు. హిందూ కాలమానం ప్రకారం మధ్యాహ్నం రామచంద్రుడు జన్మించాడు. అయోధ్యలో రామనవమిని వైభవంగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అయోధ్యకు వస్తారు. సరయు నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు ఆలయానికి వెళ్లి రామచంద్రుని దర్శనం చేసుకుంటారు.