HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄Spirituality Marri Chettu Significance And Importance Of Worshiping Banyan Tree Know

Spirituality: మర్రిచెట్టుకు పూజలు ఎందుకు చేస్తారు.. వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

సాధారణంగా హిందువులు రక రకాల మొక్కలను పూజిస్తూ ఉంటారు. వృక్షాలని దేవతలతో పోలుస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. భారతదేశ ప్రజలు పూజించే చె

  • By Nakshatra Published Date - 06:15 PM, Tue - 23 May 23
  • daily-hunt
Spirituality: మర్రిచెట్టుకు పూజలు ఎందుకు చేస్తారు.. వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

సాధారణంగా హిందువులు రక రకాల మొక్కలను పూజిస్తూ ఉంటారు. వృక్షాలని దేవతలతో పోలుస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. భారతదేశ ప్రజలు పూజించే చెట్లలో మర్రిచెట్టు కూడా ఒకటి. దీనినే వటవృక్షం అని కూడా అంటారు. మర్రిచెట్టు వరుణుడి స్థలంగా దేవతలు మునులు కీర్తిస్తారు. దీనిని న్యగ్రోధ వృక్షం అని కూడా పిలుస్తారు. న్యగ్రోధ వృక్షమంటే కిందకు పెరిగే చెట్టు అని అర్థం. ప్రళయ కాలంలో జగమంతా జలమైనప్పుడు శ్రీమహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రం పై మార్కండేయ మహామునికి దర్శనము ఇచ్చాడని భాగవతం చెబుతోంది.

ఈ అశ్వత్థ వృక్షం దేవతల నివాస స్థానం అని అధర్వణ వేదంలో ప్రస్తావించారు. ఆధ్యాత్మిక పరంగా మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. బెరడులో శ్రీ మహావిష్ణువు, వేరులో బ్రహ్మ, కొమ్మల్లో శివుడు ఉంటారని విశ్వసిస్తారు. మర్రిచెట్టును పూజిస్తే సంతానాన్ని, సంపదను అందిస్తుందని విశ్వసిస్తారు. సంతానం లేని వారు మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దక్షిణా మూర్తి మర్రిచెట్టు కింద కూర్చుని ధ్యానం చేసినట్టు పురాణాల్లో ఉంది. భగవద్గీతలో జీవితానికి అర్ధాన్ని అర్జునునికి బోధించే సమయంలో కృష్ణభగవానుడు చెప్పిన ఉదాహరణ మర్రిచెట్టే. అందుకే మర్రిచెట్టును పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు.

వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్టనష్టాల నుంచి బయటపడాలంటే మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, రాత్రిపూట వారి దిండుకింద మర్రివేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుందని విశ్వసిస్తారు. మర్రిచెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు. శనివారం మర్రిచెట్టు కాండం మీద పసుపు, కుంకుమ సమర్పించడం వల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే, గుడి దగ్గరున్న మర్రి చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు. మర్రి చెట్టుపై తెల్లటి నూలు దారాన్ని 11 సార్లు కట్టి నీరుపోస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Telegram Channel

Tags  

  • banyan tree
  • importance
  • marri chettu
  • spirituality
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Spirituality: గుడిలోకి అడుగుపెట్టేముందు గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా?

Spirituality: గుడిలోకి అడుగుపెట్టేముందు గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా?

సాధారణంగా మనం దేవాలయాలకు వెళుతూ ఉంటాం. అక్కడికి వెళ్లిన తర్వాత మనం చేసే కొన్ని రకాల పనుల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు

  • Spirituality: పసుపు కుంకుమ పొరపాటున కింద పడితే ఏం జరుగుతుందో తెలుసా?

    Spirituality: పసుపు కుంకుమ పొరపాటున కింద పడితే ఏం జరుగుతుందో తెలుసా?

  • Nirjala Ekadashi 2023 : భీముడికి వ్యాసుడు చెప్పిన వ్రతం

    Nirjala Ekadashi 2023 : భీముడికి వ్యాసుడు చెప్పిన వ్రతం

  • Vastu Tips: ఏం చేసినా కూడా కలిసి రావడం లేదా.. అయితే వాస్తు దోషం ఉందేమో చెక్ చేసుకోండిలా?

    Vastu Tips: ఏం చేసినా కూడా కలిసి రావడం లేదా.. అయితే వాస్తు దోషం ఉందేమో చెక్ చేసుకోండిలా?

  • Vasthu Tips: ఇంటి ద్వారానికి ఎదురుగా అటువంటి ఫోటోలు పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

    Vasthu Tips: ఇంటి ద్వారానికి ఎదురుగా అటువంటి ఫోటోలు పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Latest News

  • Commercial LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌పిజి సిలిండర్ ధర తగ్గింపు

  • Condoms to Funerals: అంత్యక్రియలకూ కండోమ్ తీసుకెళ్తున్నారట.. ఎందుకంటే?

  • Elon Musk: ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్.. రెండో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్..!

  • Premature Hair Greying: చిన్న వయసులోనే మీ జుట్టు కూడా తెల్లబడుతుందా.. తెల్లజుట్టుని ఎలా నియంత్రించాలో తెలుసుకోండిలా..!

  • Pakistani Intruder: పాకిస్థాన్ చొరబాటుదారుడిని హతమార్చిన భద్రతా బలగాలు

Trending

    • China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?

    • Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్

    • Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్‌ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!

    • Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

    • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version