Vibhuti: ప్రతిరోజు నుదుటిన విభూతి ధరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
నుదుటిన ధరించే బొట్టు వెనుక ఎన్నో విషయాలు ఉన్నాయని ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎన్నో విషయాలు ఉన్నాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:34 AM, Wed - 12 February 25

మామూలుగా హిందువులు నుదుటిన బొట్టు ధరించడం మనందరం చూసే ఉంటాం. స్త్రీలు కుంకుమ బొట్టు లేదంటే తిలకం వంటివి ధరిస్తూ ఉంటారు. ఇక ఆలయానికి వెళ్ళినప్పుడు విభూతి, కుంకుమ, బండారు వంటివి ధరిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మనకు శివాలయానికి వెళ్ళినప్పుడు మనం మొదటిగా విభూతిని ధరిస్తూ ఉంటాం. విభూతి అంటే భస్మం. ఈ భస్మంతోనే పరమేశ్వరుడికి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి విభూతిని ధరించడం వల్ల ఎన్నో రకాల ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
ఈ విభూతిని నుదుటిని ధరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు వంటివి తొలగిపోతాయట. అలాగే సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరి ఆయుష్షు పెరుగుతుందని సిరిసంపదలు కూడా లభిస్తాయని చెబుతున్నారు. ప్రతిరోజు పూజలు చేయలేము అనుకున్న వారు స్నానం చేసిన తర్వాత నుదుటిన విభూతిని ధరించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే సహస్రనామాలతో దేవుడిని పూజించినంత ఫలం, నిత్యం ఆలయ దర్శనం చేసుకున్నంత పుణ్యం లబిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంత శక్తివంతమైన విభూతిని దరించిన వారి జీవితం కూడా ఎంతో గొప్పగా అభివృద్ది చెందుతుందట.
అలాగే హోమం చేసిన తర్వాత వచ్చిన భస్మాని కూడా విభూతిగా ధరిస్తూ ఉంటారు. ఈ హోమ భస్మాన్ని ధరించడం వల్ల నవగ్రహ బాధలు జీవితంలో చేసిన అన్ని రకాల దోషాలు, గోచర, అగోచర,దృశ్య,అదృశ్య, రోగాలు అన్ని తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారట. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే కాసింత విభూతిని నుదుటన ధరించడం ఎంతో మంచిదని చెబుతున్నారు. కాబట్టి ఇక మీదట అయినా స్నానం చేసిన తర్వాత ఆలయాలకు వెళ్ళలేని వారు పూజలు చేయలేని వారు తప్పనిసరిగా ఈ విభూతిని ధరించండి.