Lord Shiva: రుద్రాక్ష మాల ధరించిన వారికి కలిగే మంచి ఏంటి.. ఎలాంటి నియమాలు పాటించాలి?
రుద్రాక్ష.. ఈ రుద్రాక్షను దేవదేవుడు అయిన పరమేశ్వరుని స్వరూపమని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు.
- By Nakshatra Published Date - 06:30 AM, Wed - 6 July 22

రుద్రాక్ష.. ఈ రుద్రాక్షను దేవదేవుడు అయిన పరమేశ్వరుని స్వరూపమని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ రుద్రాక్షలను పురాణాల నుంచి ఉపయోగిస్తూనే ఉన్నారు. పురాణాల ప్రకారం చూసుకుంటే ఋషులు, మునులు, దేవతలు రాక్షసులు అందరూ వీటిని ధరించేవారట. ఇక ఇప్పటికీ వేదాంతలు,గురువులు,పూజారులు లాంటి వారు ఈ రుద్రాక్ష మాలలను ధరిస్తూ ఉంటారు. అయితే ఈ రుద్రాక్ష కేవలం శక్తి భరితమైనదే కాకుండా ఔషధం గుణాలు కూడా కలిగి ఉంటుంది.
ఈ రుద్రాక్షలను ధరించిన వ్యక్తి సాక్షాత్తుగా రుద్రునికి సమానమని పురాణాల్లో కూడా చెప్పబడింది. పూర్వం ఋషులు కూడా ఈ రుద్రాక్షను ధరించి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసి శక్తులను కూడా సంపాదించుకున్నారు. అంతేకాకుండా రుద్రాక్షను ధరించిన వ్యక్తి సమస్త పాపాల నుంచి విముక్తి పొంది మోక్షం పొందుతాడు అని ఆనాటి పూర్వకాలపు ఋషులు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ రుద్రాక్ష మాలను ధరించినప్పుడు ఎంతో నిష్టగా ఉండాలి. ఏమనిబంధనలు పాటించాలి.
ఇటువంటి చెడు కార్యాలకు హాజరు కావడం లేదంటే అటువంటి పనులు చేయడం లాంటివి చేయకూడదు. పురాణాల ప్రకారం ఒకరోజు పరమేశ్వరుడు ప్రత్యక్షమై.. ఎంతటి దుర్మార్గుడు అయినా మరణించే సమయంలో రుద్రాక్ష మాలలు ధరిస్తే అతనికి తప్పకుండా శివ సాయుజ్యము లభిస్తుంది అని తెలిపారట ఆ పరమశివుడు. కాబట్టి శివమాల ఎంతటి శక్తివంతమైనదో మీరే అర్థం చేసుకోవచ్చు. రుద్రాక్ష అంటే రుద్రుని అశ్రువులు అంటే శివుడు యొక్క కన్నీటి బొట్లు అని అర్థం.
Related News

Lord Shiva : నేడు శ్రావణ మంగళవారం భౌమ ప్రదోశ వ్రతం పాటించడం వల్ల మీ జాతకంలో దోషాలు తొలగిపోవడం ఖాయం.. !!
శ్రావణ మాసంలో ప్రతి రోజు పరమశివుడికి ప్రత్యేకమైనది. శ్రావణ సోమవారం తర్వాత, మహాదేవుని అనుగ్రహం కోసం భౌమ ప్రదోష ఉపవాసం పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజు ఆగస్టు 9, మంగళవారం వచ్చింది.