Spirtual: దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!
దేవుడిని కోరిక కోరేటప్పుడు దేవుడిని దర్శనం చేసుకొని మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మొక్కుకోవడం అన్నది సహజం. మరి ఇలా చేయవచ్చా చేయకూడదా! ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:03 PM, Mon - 5 May 25

మాములుగా ఇంట్లో అదేవిధంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుళ్లకు పూజ చేయడం అన్నది సహజం. కొంతమంది తరచుగా ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఇలా ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత కోరికలు కోరుకునేటప్పుడు అలాగే దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు. చాలావరకు భక్తులు ఇలాగే చేస్తూ ఉంటారు. గుడిలో అయినా లేదంటే ఇంట్లో అయినా కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. కొంతమంది ఇలా కళ్ళు మూసుకోవడం మంచిది కాదని అంత దూరం నుంచి ఆలయాలకు వెళ్లినప్పుడు దేవుడిని కళ్ళారా చూసుకోవాలని అంటూ ఉంటారు.
మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూ ధర్మంలో మాత్రం అనేక రూపాల్లో కొలుస్తారు. దేవతలకు ప్రతీకగా ఆలయాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించి మరి పూజలు చేస్తూ ఉంటారు. చాలా మంది పండగలు, ప్రత్యేక రోజుల్లో దేవాలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలా దండం పెట్టి మొక్కుతున్నప్పడు ఎక్కువ శాతం మంది కళ్లు మూసుకుంటారు. ప్రజల్లో భక్తి భావం పెరగాలన్న కారణంగా దేవాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు హిందూ ధర్మంలో ఉంది. నిత్య జీవితంలో ప్రజలు తమకు ఉన్న ఒత్తిడుల నుంచి కాస్త రిలీఫ్ అవ్వడం కోసం ప్రతి రోజు వారి ఇళ్లకు సమీపంలో ఉన్న ఏ గుడికైనా వెళ్లి కొంత సమయం గడిపి రావాలని హింధూ ధర్మంలో ఉంది.
గుడికి వెళ్లినప్పుడు ఆ దేవతా విగ్రహాలను అలా చూస్తూ ఉండటం వల్ల మనలోని ఎనర్జీ రీఫ్రెష్ అవుతుందని హిందూ ధర్మం చెబుతోంది. ఆలయాలు నిర్మించేటప్పడు, దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించేటప్పడు మూల మంత్రాలు పఠించి, ప్రత్యేక యంత్రాలు పెట్టి ప్రతిష్ఠం చేస్తారు. దీని వల్ల ఆలయాల్లో విగ్రహాలు ప్రత్యేక శక్తిని పొందుతాయి. అలాంటి దేవతా విగ్రహాలను దర్శించినప్పుడు కచ్చితంగా కళ్లు తెరిచే దర్శించాలని వేద పండితులు చెబుతున్నారు. పూలు, పూలమాలు, వివిధ రకాల అలంకారాలతో ఉన్న విగ్రహాలను కనులారా దర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుందని చెబుతున్నారు. అలాగే మానవ శరీరం అనేక నాడులు, గ్రంధులతో నిర్మించిందట. మనసు ప్రశాంతంగా మారాలంటే ప్రధానంగా సెరోటొనిన్, ఎండార్ఫిన్ అనే రెండు రకాల హార్మోన్లు విడుదల కావాలి. సెరోటొనిన్ మెదడులోని పైనీయల్ గ్రంధి నుంచి వెలువడుతుందట. ఇది మంచి మానసిక స్థితిని, సంతోషాన్ని కలిగిస్తుందని, ఎండార్ఫిన్ పిట్యూయిటరీ గ్రంధి , హైపోతాలామస్ నుంచి విడుదల అవుతుందని,ఇవి ఒత్తిడిని తగ్గించి, ఆనందం ప్రశాంతత కలిగిస్తాయని చెబుతున్నారు. కాబట్టి గుడికి వెళ్లి కనులారా దేవతా విగ్రహాలను దర్శించినప్పుడు శరీరంలోని పైనీయల్, పిట్యూయిటరీ గ్రంధులు యాక్టివేట్ అవుతాయని,అందువల్ల మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో అయినా లేదంటే బయట ఆలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే దేవుడిని మొక్కు కొనేటప్పుడు దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు తెరిచి స్వామి వారిని చూడాలని చెబుతున్నారు.