9th day belief: పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల 9వరోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదా..?
తిథులు...అంటే కాలాన్నిలెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలు.
- By hashtagu Published Date - 08:00 AM, Mon - 6 June 22
![9th day belief: పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల 9వరోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/06/bride.jpg)
తిథులు…అంటే కాలాన్నిలెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలు. చాంద్రమానంలో 9వ తిథి నవమి. ఈ తిథి శుభకార్యాలకు అంతమంచిది కాదని చెబుతుంటారు. కానీ వివాహానికి మినహాయింపు ఉంది. నవమి విషయంలో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి ఇలా ధర్మశాస్త్రం మూడు రకాలుగా వివరించింది. పుట్టింటికి వెళ్లినా లేదా బంధువుల ఇంటికి వెళ్లినా…9వ రోజు తిరుగు ప్రయాణం చేయరాదనేది ప్రయాణ నవమి నియమం.
ఇక ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి 9వ రోజు తిరిగి ఇంటికి రాకూడదని ప్రవేశనవమి హెచ్చరిస్తుంది. నవమి తిథి నాడు ప్రయాణాలు చేస్తే కష్టనష్టాలు ఎదురవుతాయని ప్రత్యక్ష నవమి చెబుతోంది. అందుకే నవమి తిథిని ప్రయాణాలకు నిషేధించారు. ఆడపిల్లను పార్వతీదేవిగానూ, లక్ష్మీదేవిగానూ చూడటం మన సంప్రదాయం. నవమి తిథి అనేది అధిష్టాన దేవత దుర్గాదేవి. శక్తికి ప్రతిరూపమైన ఆడపడుచును అత్తగారింటికి ఆడపిల్లను పంపుతూ ఆమె ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని పుట్టినింటీకి, మెట్టినింటికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు. ప్రయాణ నవమిగా చెప్పుకునే 9వ రోజు ఆడకూతురును అత్తగారింటికి పంపించడం వల్ల సమస్యలు ఎదురవుతాయని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలోనే 9వరోజు ప్రయాణం మంచిది కాదనే నమ్మకం ఏర్పడింది.
Related News
![Travel: మీరు ఒంటరిగా జర్నీగా చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/08/travel.jpg)
Travel: మీరు ఒంటరిగా జర్నీగా చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Travel: ఒంటరిగా ప్రయాణించడం చాలా సరదాగా ఉంటుంది. అయితే మీ భద్రతను జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యం. మీరు ఒంటరిగా ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ ప్రయాణాన్ని సురక్షితంగా, సరదాగా మార్చుకోవచ్చు. ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి. ముందుగానే పరిశోధన చేయండి. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లే ముందు, ఆ స్థలం గురించి సరైన సమాచారాన్ని �