Shivaratri: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు
- By Balu J Published Date - 12:21 AM, Sat - 9 March 24

Shivaratri: తిరుపతిజిల్లా, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని వివిధ రకాల పూలతో పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నైనానందకరంగా ముస్తాబు చేశారు. ఉదయం రెండు గంటల నుంచి స్వామి,అమ్మ వార్ల దర్శనార్థం భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం ఓంకార నామస్మరణలతో మారుమ్రోగుతుంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, నిర్వహించారు. స్వామివారు భక్తులకు వాయులింగంగా ముక్కంటిగా భక్తులకు దర్శనమిస్తూ కరుణిస్తున్నారు.
అమ్మవారు జ్ఞానాంబికాదేవిగా భక్తుల మొర ఆలకిస్తూ కల్పవల్లిగా దర్శనమిస్తున్నారు.ఆలయ ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ… మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లక్ష మంది భక్తులు స్వామి అమ్మవాలను దర్శించుకుంటారని, ఉదయం రెండు గంటల నుంచి భక్తులకు దర్శన సదుపాయం కల్పించామన్నారు. సర్వదర్శనంతో పాటు రూ.50, రూ.200, రూ.500ల టికెట్లతో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు.భక్తులకు మహాలఘు దర్శన ఏర్పాట్లు నిర్వహించామన్నారు.