Shivarathri : శివరాత్రి రోజున జాగారం ఎందుకు చేస్తారో తెలుసా..?
హిందువులు జరుపుకునే అతిముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండ్ ప్రకారం...కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో బహుళ చతుర్దశినాడు...ఇంకొన్ని ప్రాంతాల్లో ఫాల్గుణ మాసంలో క్రిష్ణపక్షం చతుర్ధతి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు.
- By Hashtag U Published Date - 11:58 AM, Thu - 24 February 22

హిందువులు జరుపుకునే అతిముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండ్ ప్రకారం…కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో బహుళ చతుర్దశినాడు…ఇంకొన్ని ప్రాంతాల్లో ఫాల్గుణ మాసంలో క్రిష్ణపక్షం చతుర్ధతి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున ముక్కోటిదేవతలలో సనాతుడైన శివుడిని భక్తితో ఆరాధించినట్లయితే…కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తుల నమ్మకం.ఇక మహాశివరాత్రి పండుగ గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో శివుడు ఉద్భవించాడట. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం అనంతరం విశన్నంతటినీ కూడా దేదీప్యమానం చేసిన సమయంలో భక్తులు అస్సలు నిద్రపోకూడదు.
మహాశివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందని పురాణాల్లో ఉంది. పురాణాల ప్రకారం…మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో పుణ్యతీర్ధాలన్నీ బిల్వమూలంలోనే ఉంటాయి. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండి…ఒక్క బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు మహాశివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజల్లో పాల్గొన్నట్లయితే సిరిసంపదలు పెరుగుతాయని పండితులు చెబుతుంటారు.ఇక పురాణాల ప్రకారం…కైలాస పర్వతం మీద పార్వతీ, పరమేశ్వరులు సుఖాసీనులై ఉంటారు. అప్పుడు పార్వతి శివున్ని…అడుగుతుందని..ఏమని అంటే అన్ని వ్రతాల్లోనూ ఉత్తమమైన వ్రతం ఏది అని. అప్పుడు శివుడు వ్రతం అన్ని వ్రతాలకంటే ఉత్తమమైందని జవాబు ఇస్తారు. అంతేకాదు ఆ వ్రతం యొక్క విశేషాలను కూడా తెలియజేస్తాడు. అయితే ఈ వ్రతాన్ని బహుళ చతుర్దశిరోజున మాత్రమే ఆచరించాలని తెలిసి చేసినా…తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒకసారి చేసినా…యముని నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. అదే సంద్భంలో శివుడు పార్వతిదేవీకి ఓ కథను చెప్పాడు. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లోక రక్షణ కోసం…
పరమేశ్వరుడు విషం మింగి…తన గొంతులో దాచుకున్న రోజునే మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అమృతం కోసం దేవదేవులు క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో హాలహలం వస్తుంది. వాటి జ్వాలలు ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతుండటంతో అందరూ ఈశ్వరుడిని శరణు వేడుకున్నారు.
శివుడు నీలకంఠుడిగా మారి…
భక్తవశంకరుడైన పరమేశ్వరుడు…ఆ సమయంలో హాలహలాన్ని తీసుకుని మింగుతూ తన కంఠంలో బంధించాడు. దాని ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయింది. అంతే అప్పుడు అది నీలిరంగులోకి మారింది. దీంతో శివుడు నీలకంఠరుడిగా మారాడు. ఈ సమయంలో శివుడు కిందపడిపోయాడు. అప్పుడు పార్వతీ దేవి తన భర్త తలను ఒడిలోకి తీసుకుని దు:ఖిస్తుంది. అక్కడున్న అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పుడు శివుడు మెళుకువలోకి వచ్చేంత వరకు జాగరణ చేస్తారు. అప్పటి నుంచి భక్తితో శివున్ని పూజించి జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ సంవత్సరం మార్చి 1, 2022న అంటే మంగళవారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది.