Shani Gochar 2024: నక్షత్రం మార్చుకోనున్న శనీశ్వరుడు.. అక్టోబర్ నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే?
శనీశ్వరుడు నక్షత్రం మార్చుకోనున్న సందర్భంగా అక్టోబర్ మూడవ తేదీ నుంచి కొన్ని రోజుల వారికి అంత మంచి జరగబోతోంది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:31 PM, Thu - 26 September 24

నవగ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నవగ్రహాలలో చివరి గ్రహం అయిన శనీశ్వరుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా శని దేవుడిని పిలుస్తూ ఉంటారు. అలాగే శని దేవుడిని న్యాయదేవుడిగా కూడా అభిమానిస్తూ ఉంటారు. మంద గమనుడు శనిశ్వరుడి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఈ నేపధ్యంలో శనిశ్వరుడి 3 అక్టోబర్ 2024న అంటే నవరాత్రుల మొదటి రోజున శతభిషా నక్షత్రంలో సంచరించబోతున్నాడు.
శనిశ్వరుడి ఈ నక్షత్ర మార్పు కారణంగా కొన్ని రాశుల వారు వృత్తి, వ్యాపార పురోగతిని పొందవచ్చు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది అని చెప్పవచ్చు. ఇంతకీ ఆ రాశులు ఏవి ఆ రాశులకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా
పంచాంగం ప్రకారం శనిశ్వరుడి అక్టోబర్ 3వ తేదీ అర్ధరాత్రి 12.20 గంటలకు శతభిషా నక్షత్రంలో సంచరించబోతున్నాడు. శతభిషా నక్షత్రంలో శనిశ్వరుడి ప్రవేశం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు చాలా శుభప్రదం అవుతుంది.
ఇందులో మొదటిది మేషరాశి. ఈ రాశికి చెందిన వారికి ఈ సమయం అదృష్టంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. దీంతో సంపద వృద్ధి కూడా చెందుతుంది. మేషరాశిలో శనిశ్వరుడి పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశుల వారు తమ వృత్తి, వ్యాపారాలలో గొప్ప విజయాన్ని పొందవచ్చు. అంతేకాదు అప్పుల నుండి కూడా విముక్తి పొందవచ్చని చెబుతున్నారు.
ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న రాశి సింహ రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా శనిశ్వరుడి నక్షత్ర మార్పుతో శుభ ఫలితాలను పొందుతారట. సింహ రాశి వారికి ఈ మార్పు కెరీర్, వ్యాపారానికి మాత్రమే కాకుండా వైవాహిక జీవితానికి కూడా మంచిది. సింహ రాశి వారు తమ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారట.
అదేవిధంగా ధనుస్సు రాశి వారికి శనిశ్వరుడి నక్షత్ర మార్పు శుభప్రదం అవుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. వస్తు సౌఖ్యాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట. పైన రాశుల వారు శని దేవుడిని ఆరాధించాలి అనుకుంటే శనివారం రోజు ఉత్తమమైన గా పరిగణించబడుతుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత శని దేవుని పూజించడం మంచిది. అయితే శనీశ్వరుని ఆరాధించే సమయంలో ఎప్పుడూ కూడా నేరుగా కళ్ళలోకి కాకుండా ఆయన పాదాల వైపు మాత్రమే చూడాలి. శనిశ్వరుడి కళ్లలోకి చూడటం వల్ల చెడు దృష్టి పడుతుందని నమ్మకం. శనిశ్వరుడిని పూజించే సమయంలో ముఖం పడమర వైపు ఉండాలి. శనిశ్వరుడిని పూజించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. శనిశ్వరుడికి ఇష్టమైన రంగులు నీలం, నలుప రంగుల దుస్తులను ధరించి పూజించాలి.