Shani Dev: ఆ పనులు చేసేవారంటే శనీశ్వరుడికి కోపం.. వెంటనే మార్చుకోవాలి?
సాధారణంగా చాలామంది శనీశ్వరుడి పేరు విన్న, శనీశ్వరుని ఆలయానికి వెళ్లాలి అన్న భయపడిపోతూ ఉంటారు.
- By Nakshatra Published Date - 08:30 AM, Sat - 29 October 22
సాధారణంగా చాలామంది శనీశ్వరుడి పేరు విన్న, శనీశ్వరుని ఆలయానికి వెళ్లాలి అన్న భయపడిపోతూ ఉంటారు. పురాణాల ప్రకారం శని దేవున్ని న్యాయదేవుడిగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శని దేవుడు కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. అలాగే శనీశ్వరుడిని కలియుగానికి అధిపతిగా కూడా పిలుస్తూ ఉంటారు. మన కర్మల ఆధారంగా శనీశ్వరుడు మంచి అలాగే చెడు పలాలను ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మనం శనీశ్వరుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా శని దేవునికి ఎదురుగా నిలబడకూడదు. అలా చేయడం వల్ల శనీశ్వరుని ద్రుష్టి నేరుగా మీపై పడి అష్ట కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా శనీశ్వరుని దృష్టి మనపై పడకుండా చూసుకోవాలి.
శనీశ్వరుని అనుగ్రహం ఉంటే చాలు అటువంటి వారికి సుఖ సంతోషాలకు అష్టైశ్వర్యాలకు కొదువ ఉండదు. సాధారణంగా శనీశ్వరుని వక్రదృష్టి కొందరిపై ఉంటుందట. మరి శనీశ్వరుడి దృష్టి ఎవరిపై ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా శనీశ్వరుడు చెడు పనులు చేసే వారిని ఎప్పుడు విడిచి పెట్టడు. అందుకే శనీశ్వరుడు ని క్రూర గ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు. శనీశ్వరుని దృష్టి ఎప్పుడూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టే వారిపై ఉంటుంది. ఇతరులను ఇబ్బంది కలిగించే వారికి శని దేవుడు కష్టాలను కలిగిస్తాడు. అదేవిధంగా స్త్రీలు వృద్ధులు, నిస్సహాయులు, వికలాంగులు, పనిచేసే కూలీలను వేధించే వారిని శని దేవుడు ఇబ్బందులకు గురి చేస్తాడు. అలాగే ఇప్పుడు పక్కవారిని మోసం చేయాలి అనుకున్న వారిని కూడా కష్టపెడతాడు.
అబద్ధాలు చెప్పే వారికి, చెడు ఉద్దేశంతో ఉండేవారికి శని సమస్యలను కూడా సృష్టిస్తూ ఉంటాడు. అలాగే తప్పుడు పనులు చేసి సంపాదించిన డబ్బును ఒక్క క్షణంలో శనీశ్వరుడు లాగేసుకుంటాడు. అదేవిధంగా శని మహాదశ సమయంలో ఎవరైతే చెడు పనులు చేస్తూ ఉంటారో వారిపై మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తాడు శనీశ్వరుడు. అందుకే శనీశ్వరుడు ఎప్పుడూ తప్పుడు పనులు చేసే వారిని ఓ కంట కనిపెడుతూ ఉంటాడు అని అంటూ ఉంటారు. అలాగే నిస్సహాయుకు , వికలాంగులకు, జంతువులకు, పక్షులకు ఇబ్బంది కలిగించే వారి పై శనీశ్వరుని దృష్టి ఉంటుంది. అటువంటి వారిని శని దారుణంగా శిక్షిస్తాడు.
Related News
Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!
మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాల�