Shani Dev: శనివారం రోజు పొరపాటున కూడా ఆ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో?
మామూలుగా కొంతమంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. ఆయన ఆలయానికి వెళ్లాలన్న ఆయన పూజ చేయాలన్నా కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ శని దేవుడు ప్రభావం ఎంత చెడుగా ఉంటుందో ఆయన అనుగ్రహం
- By Anshu Published Date - 01:00 PM, Thu - 18 July 24

మామూలుగా కొంతమంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. ఆయన ఆలయానికి వెళ్లాలన్న ఆయన పూజ చేయాలన్నా కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ శని దేవుడు ప్రభావం ఎంత చెడుగా ఉంటుందో ఆయన అనుగ్రహం లభిస్తే మంచి ఫలితాలు కూడా అంతకు రెట్టింపుగా ఉంటాయని చెబుతున్నారు పండితులు. వారంలో శనివారం రోజు శని దేవుడికి అంకితం చేయబడింది. కాబట్టి ఈరోజున స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు దానధర్మాలు చేయడం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు.
అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే శనివారం రోజు కొన్ని పనులు చేయడం అసలు మంచిది కాదట. పొరపాటున కూడా తెలిసి తెలియక అలాంటి తప్పులు చేస్తే ఆగ్రహానికి లోనవ్వక తప్పదు అంటున్నారు పండితులు. మరి శనివారం రోజు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శని దేవుడిని న్యాయాధిపతిగా పిలుస్తారు. అంటే మనుషులు చేసే మంచి చెడుల పనుల ఆధారంగా వారికి శుభ అశుభ ఫలితాలను అందిస్తాడని చెబుతూ ఉంటారు. ఇకపోతే శనివారం రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే శని దేవుని ఆగ్రహానికి లోనవ్వక తప్పదు అంటున్నారు పండితులు.
శనివారం నాడు ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదట.అలాగే శనివారం కొనుక్కున్న ఇనుప వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే శనిదేవుని కంట పడటం ఖాయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం నాడు ఇనుప సామాను కొనుగోలు చేయవద్దు అంటున్నారు పండితులు. అలాగే శనివారం ఉప్పు కొనడం కూడా నిషేధించబడింది. ఉప్పును కొనుగోలు చేయడం ద్వారా అది ఆరోగ్యానికి దారితీస్తుందట. అలాగే శనివారం రోజు తెలిసి తెలియకుండా కూడా గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు. మీకు కనుక గోర్లు కత్తిరించే అలవాటు గోర్లు కొరికే అలవాటు ఉంటే శనివారం రోజు మాత్రం పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.
శనివారం రోజు మద్యం మాంసం అసలు ముట్టకూడదు. కేవలం సాత్విక ఆహారాలు తినడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుందట. ఇక శనివారం రోజు అశ్వత వృక్షాన్ని పూజించడం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే శనివారం నల్ల నువ్వులు కొనకూడదు. ఈ రోజు నువ్వులు కొంటే మన పనికి ఆటంకం. నల్ల బూట్లు లేదా నల్లని చెప్పులు కూడా కొనుగోలు చేయకూడదు.