HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >September 2022 Monthly Horoscope L This One Zodiac Sign Will Be Lucky

Lucky Zodiac In Spetember: సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వాళ్లకు రాజయోగం.. ధన యోగమే!!

సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మాస ఫలాలు వచ్చేశాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి.

  • By Hashtag U Published Date - 07:15 AM, Sat - 3 September 22
  • daily-hunt

సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మాస ఫలాలు వచ్చేశాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకొందరికి మిశ్రమ అనుభవాలు ఉంటాయి. గ్రహాల గమనాన్ని బట్టి మేషం నుంచి మీనం దాకా ఆయా రాశుల వారికి ఉన్న అనుకూలతలు, ప్రతికూలతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి..

మేష రాశి వారికి శుభకార్యాల కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి వారికీ ఈ నెల ఆదాయం పెరుగుతుంది. మీన రాశి వారికీ ఈ నెల ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదువు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు.

వృషభ రాశి..

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అయితే, అనుకోని ఖర్చులు కూడా వచ్చి పడుతుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొందరితో అనవసర పరిచయాలు ఏర్పడి ఇబ్బందులు పడతారు. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. కోర్టు కేసులో మీ లాయర్‌ మిమ్మల్ని పక్కదోవ పట్టించే అవకాశం ఉంది.

మిథునం..

ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు పెరుగుతాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు శ్రమ ఎక్కువ ఉపయోగం తక్కువగా ఉంటుంది. చేతికి అందాల్సినవి చివరి క్షణంలో చేజారిపోతుంటాయి. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు.ప్లాటును గానీ, ఫ్లాటును గానీ కొనే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు.

కర్కాటకం..

ఈ రాశి వారికి ఈ నెల మొదటి 3 వారాలకన్నా చివరి వారం చాలా బాగుంది. ఆదాయం పెరుగుతుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

సింహ రాశి..

ఈ రాశి వారికి ఈ నెలలో పట్టిందల్లా బంగారమవుతుంది. అనుకున్న పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో శుభ కార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అన్ని విధాలా అనుకూలమైన సమయం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు.

కన్యా రాశి..

ఈ రాశి వారికి ఈ
నెలలో చివరి వారం నుంచి కొంత అనుకూల సమయం ప్రారంభమవుతుంది. త్వరలో మీ కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంది. వివాహా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్‌ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రతికూల గ్రహ సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. తరచూ శివార్చన చేయించండి.

తుల రాశి..

ఈ రాశికి చెందిన వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి సెప్టెంబరు నెల మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. అర్ధాష్టమ శని కారణంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభించే అవకాశం ఉంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రోజులు ముగిసి ఆఫీసులో పనిచేయాల్సిన అవసరం రావచ్చు. తోబుట్టువులు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలలో గెలిచే సూచనలున్నాయి.

వృశ్చికం

ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా వరకు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడవద్దు. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ వివాదాలకు, వాదాలకు దిగవద్దు. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి, కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. స్టార్టప్‌ సంస్థలవారికి కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. ఒక ఇంటివారు కావాలన్న మీ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగం ఉంటుంది.

ధనుస్సు

ఈ రాశి వారికి సెప్టెంబర్ లో ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు హద్దులు దాటుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తుంటాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగంలో స్థిరపడాలన్న మీ కల నెరవేరడానికి కొద్దిగా సమయం పడుతుంది. ప్రస్తుతానికి మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. మీ తల్లితండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వడ్డీ వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి.

మకర రాశి

ఈ రాశి వారికి సెప్టెంబర్ లో శ్రమపడే తత్వం, నిజాయతీ, ఔదార్యం అండగా నిలుస్తాయి. ఏల్నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం కావడం, మధ్య మధ్య అనారోగ్యాలు తలెత్తడం జరుగుతుంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకండి. సతీమణితో వివాదాలకు దిగవద్దు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

కుంభ రాశి..

ఈ రాశి వారికి సెప్టెంబర్ లో చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. భార్యాపిల్లలతో కలిసి సరదగా గడుపుతారు. ఏల్నాటి శని కారణంగా తిప్పట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి.సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది.

మీన రాశి..

ఈ రాశి వారికి సెప్టెంబర్ లో ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదువు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంది. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • horoscope
  • one zodiac sign will shine
  • september month zodiac signs

Related News

    Latest News

    • Parliament Session: పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించండి – ప్రధాని మోదీ

    • ED Notice : కేరళ సీఎంకు ED నోటీసులు

    • NUDGE 2.0 : వేల కోట్లు దాచేవారిపై ఐటీ శాఖ నిఘా.. డబుల్ టాక్స్!

    • Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!

    • Vizag Glass Bridge : నేడే గ్లాస్ బ్రిడ్జి (స్కైవాక్) ప్రారంభం

    Trending News

      • AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

      • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచ‌రీ సంఖ్య ఎంతో తెలుసా?

      • Most Matches: రోహిత్ శ‌ర్మ- విరాట్ కోహ్లీ జోడీ.. భార‌త్ త‌ర‌పున స‌రికొత్త రికార్డు!

      • Rohit Sharma: ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శ‌ర్మ‌!

      • Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు మ‌ళ్లీ తిరిగి వ‌స్తాడా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd