Vastu Tips: ఆరోగ్యానికి కాదండోయ్ ఆర్థిక పరిస్థితి కూడా బెల్లం ఉపయోగపడుతుంది.. ఎలా అంటే?
ప్రతి ఒక్కరి ఇంట్లో బెల్లం అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఈ బెల్లాన్ని ఎన్నో రకాల తీపి పదార్థాలలో ఉపయోగిస్తూ
- By Nakshatra Published Date - 06:00 AM, Sat - 31 December 22
ప్రతి ఒక్కరి ఇంట్లో బెల్లం అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఈ బెల్లాన్ని ఎన్నో రకాల తీపి పదార్థాలలో ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొంతమంది రసం కాకరకాయ లాంటి కర్రీలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా బెల్లం తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అందుకే వైద్యులు కూడా చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినమని చెబుతూ ఉంటారు. అయితే మన వంటింట్లో దొరికే బెల్లం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
అదృస్టాన్ని మార్చడంతో పాటు ఆర్థిక సంక్షోభం నుండి బయట పడేస్తుంది. మరి బెల్లంతో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక ఎర్రని బట్టను తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. ఆ తర్వాత అందులో కొన్ని నాణేలు కూడా వేయాలి. దానిని ఒక మూటలాగా కట్టి లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ముందు ఐదు రోజులపాటు ఉంచి పూజించాలి. ఐదు రోజుల తర్వాత ఆ కట్టను మీ ఇంట్లో లేదంటే మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఐదు రోజులు ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక భారం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది.
అంతేకాకుండా డబ్బు వచ్చే ఆదాయ మార్గాలు కూడా తెరచుకుంటాయి. అలాగే మీరు ఏదైనా కోరిక అనుకొని దాన్ని నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏడు బెల్లం ముక్కలు, ఒక రూపాయి నాణెం,అలాగే ఏడు పసుపు కొమ్ములు తీసుకుని ఒక పసుపు గుడ్డలో కట్టి గురువారం రోజున రైల్వే లైన్ దగ్గర విసిరి వేయాలి. అలా విసిరేసేటప్పుడు కొన్ని కోరికలు కోరుకొని అవి నెరవేరాలని ప్రార్థిస్తూ వాటిని విసిరేయాలి.
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.