HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Salt While Eating It Is Right Or Wrong

‎Astrology: ఏంటి.. భోజన సమయంలో ఉప్పు అడగకూడదా.. గ్రహాల కోపానికి గురికాక తప్పదా?

‎Astrology: భోజనం చేసే సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల గ్రహాల కోపానికి గురి కాక తప్పదు అని హెచ్చరిస్తున్నారు ఆధ్యాత్మిక పండితులు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • By Anshu Published Date - 07:00 AM, Wed - 3 December 25
  • daily-hunt
Astrology
Astrology

‎Astrology: మామూలుగా ఆహారం తినే సమయంలో చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. అంటే తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడడం, పొట్లాడుకోవడం లాంటివి చేస్తుంటారు. కాగా హిందూ ధర్మం జ్యోతిష్యశాస్త్రంలో ఆహారం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. ఇది శక్తి, సంస్కారం, గ్రహాల సమతుల్యతతో ముడిపడి ఉంటుందట. అందువల్ల ఆహారానికి సంబంధించిన కొన్ని అలవాట్లు గ్రహాల స్థితిపై నేరుగా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అలాగే వాస్తు, జ్యోతిష్యంలో ఆహారం కోసం ఎన్నో నియమాలు ఉన్నాయి.
‎
‎వంట చేయడం నుంచి తినడం వరకు నియమాలు, దిశలు ప్రత్యేకంగా సూచించారు వాస్తు జ్యోతిష్య శాస్త్ర పండితులు. వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలట. అయినప్పటికీ తెలియకుండానే మనం కొన్ని తప్పులు చేస్తాం. ఇది ఆరోగ్యంపైనే కాకుండా గ్రహాల స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. ఆహారం తీసుకునేటప్పుడు, మనకు కొన్నిసార్లు నీరు, కొన్నిసార్లు మిరపకాయలు, కొన్నిసార్లు ఊరగాయలు, కొన్నిసార్లు ఉప్పు అవసరం అవుతుంది. అవన్నీ అడిగి వేయించుకుంటాం. కానీ జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెబుతున్నారంటే భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగకూడదట.
‎
‎ భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగడం అనే చిన్న అలవాటు మీ జాతకంలో గ్రహాలను అసమతుల్యం చేసి సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. మీరు భోజనం చేసేటప్పుడు ఉప్పు అడిగితే ఇది చంద్రుడు , శుక్రుడు వంటి గ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తుందట. తెలుపు రంగు ఉప్పు చంద్రుడు, శుక్ర గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుందట. అందువల్ల, ఉప్పు ఆహారంలో రుచిని పెంచడమే కాకుండా మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగడం మానసిక అస్థిరతకు సంకేతం. అలాగే తరచుగా అలా చేసేవారికి భౌతిక సుఖాలు తగ్గుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా జ్యోతిష్యంలో ఎక్కువ ఉప్పు తినడం వల్ల సూర్య గ్రహం బలహీనంగా ఉండటానికి సంకేతం అని నమ్ముతారు.
‎
‎దీనికి కారణం ఏంటంటే, సూర్యుడు అగ్ని మూలకం కలిగిన గ్రహం, ఇది ఆత్మవిశ్వాసం, శక్తి, నాయకత్వం, తేజస్సు , ప్రతిష్టకు కారకంగా పరిగణిస్తారు. అదే సమయంలో ఉప్పు భూమి, నీటి మూలకాలతో ముడిపడి ఉంటుందట. దానిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో బద్ధకం, సోమరితనం, నీటి మూలకం పెరుగుతుందట. శరీరంలో నీటి మూలకం పెరిగినప్పుడు, అగ్ని మూలకం బలహీనపడుతుందట. అందుకే ఎక్కువ ఉప్పు తినడం వల్ల వ్యక్తి యొక్క తేజస్సు నిర్ణయాధికారం ప్రభావితమవుతుందని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asking salt
  • astrology
  • salt
  • spirituality

Related News

Wash Clothes

Wash Clothes: ‎రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‎Wash Clothes: రాత్రి సమయంలో బట్టలు నిజంగానే ఉతకకూడదా, ఉతికితే ఏం జరుగుతుంది. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Spiritual

    ‎Spiritual: పూజ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

  • Spiritual

    Spiritual: ‎చేతిలో నుంచి హారతి పళ్ళెం కింద పడిపోతే ఏం జరుగుతుందో, దాని అర్థం ఏంటో మీకు తెలుసా?

Latest News

  • Tamarind Seeds: ‎వామ్మో.. చింత గింజల వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా?

  • ‎Cough: పొడిదగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

  • ‎Astrology: ఏంటి.. భోజన సమయంలో ఉప్పు అడగకూడదా.. గ్రహాల కోపానికి గురికాక తప్పదా?

  • White Hair : తెల్ల జుట్టు వచ్చిందా!నల్లగా మారడానికి హోమ్ రెమెడీ

  • ‎Deepam: దీపం ఆరిపోయిన తర్వాత మళ్లీ వెలిగించవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

Trending News

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd