Spirituality: కాకులకు పిండప్రదానాలను ఆహారంగా ఎందుకు పెడతారో మీకు తెలుసా?
కేవలం కాకులకు మాత్రమే పిండ ప్రధానలను ఆహారంగా ఎందుకు సమర్పిస్తారు అన్న విషయం గురించి తెలిపారు.
- By Anshu Published Date - 01:30 PM, Sun - 25 August 24

భారతదేశంలో హిందువులు ఎప్పటికీ ఎన్నో రకాల ఆచారాలను సంస్కృతి సంప్రదాయాలను పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం పాటిస్తున్న వాటిలో కొన్ని ఆచార, సంప్రదాయాలు శాస్త్రీయంగా కూడా నిరూపించబడినవి. వాటిలో మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడో రోజు నుండి పదిరోజుల లోపు కాకులకు పిండ ప్రదానం చేయడం కూడా ఒకటి. అలాగే పితృపక్షాల కాలంలో, ఏదైనా నదికి పుష్కరాలు వచ్చిన సమయంలోనూ చాలా మంది కాకులకు పిండప్రదానాలు పెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా కాకులు వాలితే దోషమని కాకి కాలితో తంతే వారికి చాలా పెద్ద సంకోభం ఎదురువుతుందని చాలా మంది భయపడిపోతూ ఉంటారు.
అంతేకాదు కాకి ఇంటి దగ్గర గోడపై వాలి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారని, ఒకవేళ కాకి ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంటిని ఆరు మాసాల పాటు విడిచిపెట్టి వెళ్లాలని చెబుతూ ఉంటారు. అయితే దీని గురించి చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ నిజమేనా, మూఢ నమ్మకాలా అన్న విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ సందర్భంగా కాకులకు పిండప్రదానాన్ని ఎందుకని ఆహారంగా పెడతారు, కాకులు కూడా వాటిని ఇష్టంగా ఎందుకు తింటాయి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని చాలా మందికి నమ్మకం. అంతేకాదు వారు కాకి రూపంలో వచ్చి ఆహారాన్ని తీసుకుంటారని నమ్ముతారు.
ఈ ఆనవాయితీని పురాణాల కాలం నుండి ఇప్పటికే పాటిస్తూనే ఉన్నారు. మన కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వారి పేరుతో పిండం పెట్టడం అనేది మన ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. కర్మకాండలలో భాగంగా కాకులకు ఆహారం పెడుతూ ఉంటారు. అయితే మనం పెట్టిన ఆహారాన్ని కాకులు పూర్తిగా తింటే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని, ఒకవేళ కాకులు వచ్చి మనం పెట్టిన ఆహారాన్ని ముట్టకపోతే వారి కోరికలు తిరలేదని, వారు ఇంకా అసంతృప్తితో ఉన్నారని భావిస్తుంటారు. అలాగే కేవలం ఇష్టమైన వారు మాత్రమే పిండ ప్రధానం చేస్తే కాకుల ముడతాయని చెబుతూ ఉంటారు.
అయితే దీని వెనుక ఒక కథ కూడా ఉంది. అదేమిటంటే యమలోకంలో నరకబాధలను అనుభవించే వారు బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా అలా మరణించి వారికి సమర్పించే ఆహారాన్ని కాకులు తిన్నప్పుడే వారికి విముక్తి కలుగుతుందనీ, ఆ యముడు స్వయంగా కాకులకు ఇలాంటి వరాలు ఇవ్వడం వల్లనే ఇప్పటికీ చాలా మంది పితృకర్మల సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అంతేకాకుండా దీని వెనుక ఒక పరమార్థం కూడా దాగి ఉంది. ఇలా పితృకర్మలు, కర్మకాండల సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా పక్షి జాతులకు ఆహారం అందించాలనే ఈ పద్ధతిని పెట్టారు. అప్పట్లో కాకులే ఎక్కువగా జీవించేవి. అందుకే మన పెద్దలు పిండ ప్రదానం సమయంలో కాకులకు ఎక్కువగా ఆహారాన్ని సమర్పించేవారు. ఇదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.