Shani Dev: శని దేవుడు ఇబ్బందులు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసా?
సాధారణంగా మనం అనుకున్న పనులు జరగకపోయినా, ఆర్థికంగా సమస్యలు వచ్చిన ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది అని అంటూ ఉంటారు. అయితే అందరూ అనుకుంటున్న విధంగా శని దేవుడు ఇబ్బందుల పాలు చేస్తాడా?
- By Nakshatra Published Date - 06:30 AM, Sat - 10 September 22
సాధారణంగా మనం అనుకున్న పనులు జరగకపోయినా, ఆర్థికంగా సమస్యలు వచ్చిన ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది అని అంటూ ఉంటారు. అయితే అందరూ అనుకుంటున్న విధంగా శని దేవుడు ఇబ్బందుల పాలు చేస్తాడా? అసలు అలా ఎందుకు చేస్తాడు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా శని దేవుడు శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. శని దేవుడిని తిట్టుకుంటూ కూడా ఉంటారు. అని అటువంటి అభిప్రాయం సరికాదు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే శని దేవుడు మహాశివ భక్తుడు.
చాలామంది ఎటువంటి చెడు పనులు జరిగినా కూడా ముందుగా శని దేవుడిని తిట్టుకుంటూ ఉంటారు. కానీ మనం చేసే మంచిపనులే మనకు శ్రీరామరక్ష అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు, పన్నెండో ఇంట, లగ్నంలో చంద్రుడితో, చంద్రుడికి తరువాత రెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిననాటి శని ఆరంభమైనట్టే చెప్పవచ్చు. అలాగే శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు, మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది.
దానాలు, ధర్మాలు, సత్కార్యాలు సత్కాలక్షేపాలు చేస్తే శని దేవుడు అటువంటి వ్యక్తికి మేలే చేస్తాడు. అలాగే మనం చేసిన తప్పులకు వారి కర్మ ఫలం అనుభవించక తప్పదు. అయితే శని దేవుడు అంటే భయపడి పూజించని వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ శని దేవుడిని ఆయనను భక్తిశ్రద్ధలతో వేడుకోవడం వల్ల కూడా ఆయన సుఖ సంతోషాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలిగేలా కూడా దీవిస్తాడు.
Related News
Shani: శనిదేవుని దుష్ప్రభావం మీపై ఉండకూడదంటే శనివారం రోజు ఈ ఆహారం తినాల్సిందే?
సాధారణంగా చాలామంది శనీశ్వరుని పేరు వెంటనే చాలా భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుని పూజించాలి అన్న ఆయన ఆలయానికి వెళ్లాలి అన్న కూడా భయ