Raksha bandhan 2024: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చాలు లక్ష్మి అనుగ్రహం కలగడం ఖాయం ?
రాఖీ పండుగ రోజున కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చని చెబుతున్నారు..
- By Anshu Published Date - 05:00 PM, Wed - 14 August 24

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే రాఖీ పండుగ అనగా రక్షాబంధన్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ పండుగను అక్క తమ్ముడు అన్నా చెల్లెలు జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. కాగా శాస్త్రాలు ప్రకారం ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి సంబంధించినది కాబట్టి ఈ రోజున కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.. రాఖీ పౌర్ణమి పండుగ రోజున అంటే శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజున మహా విష్ణువుకు సంబంధించిన లక్ష్మీ నారాయణుడికి ప్రత్యేక పూజలు చేస్తే మీకు సంపద, ఆరోగ్యం సులభంగా పెరుగుతుందట.
అంతేకాకుండా కనకధార స్తోత్రం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే రాఖీ పండుగ రోజున అక్కా చెల్లెళ్లు, అన్నా దమ్ములు చంద్రుడితో పాటు నవగ్రహాలకు శాంతి పూజ చేయించాలి. గ్రహాలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని, ప్రతికూల గ్రహాల శుభ ప్రభావాలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారట. మీరు ప్రతి ప్రయత్నంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారని చెబుతున్నారు పండితులు.
రాఖీ పండుగ రోజున మీరు బాల క్రిష్ణుడికి, మీ కులదేవతలకు రక్షా సూత్రాన్ని కడితే మీ కుటుంబంలో ఆనందం, శాంతి శ్రేయస్సు వెల్లి విరుస్తాయట. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మరింత పెరుగుతాయి. దీంతో పాటు మీ ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను సైతం సులభంగా అధిగమిస్తారట. అలాగే ఈ రక్షా బంధన్ పండుగ రోజున అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు రాఖీ కట్టుకున్న అనంతరం, మీ సామర్థ్యం మేరకు పేదలకు, అవసరమైన వారికి ఆహారం లేదా ధనాన్ని దానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున ఇలాంటి పని చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. అలాగే మీరు చనిపోయిన తర్వాత మీకు మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజున మీరు ఆహారం లేదా ధనాన్ని దానం చేయడం వల్ల మీరు మరింత ధనవంతులవుతారట.