Pooja: ఉదయం పూజ చేయకపోతే సాయంత్రం చేయవచ్చా.. చేయకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
Pooja: ఉదయం సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల పూజ చేయలేని వారు సాయంత్రం సమయంలో పూజ చేయవచ్చా చేయకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:30 AM, Tue - 25 November 25
Pooja: మామూలుగా ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల అనేక మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. ఏ ఇంట అయితే నిత్యదీపారాధన ఉంటుందో ఆ ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ శక్తులు ప్రవేశించవని అలాగే దేవుడి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెబుతుంటారు. అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమంది ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం సమయంలో పూజ చేస్తూ ఉంటారు.
ఇలాంటి సమయంలో ఉదయం పూజ చేయకపోతే సాయంత్రం చేయవచ్చా చేయకూడదా అన్న అనుమానం కలుగుతూ ఉంటుంది. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దైవారాధనకు ప్రాతఃకాలం సరైనది అని చెప్పాలి. ఈ సమయంలో పూజ చేయడం వల్ల మనసు దేవుడిపై లగ్నం అవుతుంది. ఈ సమయంలో ప్రకృతి పరిశుద్ధంగా ఉష్ణోగ్రత తీవ్రతలు లేకుండా, ప్రశాంతంగా భగవంతుడి సేవకు అనుకూలంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేచిన వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అందుకే మన పూర్వీకులు సైతం దీపారాధనకు ఈ సమయాన్ని నిర్ణయించారు. తెల్లవారుజామున తొలి సంధ్య వేళలో దైవతార్చన వల్ల దేవత అనుగ్రహం లభిస్తుందట. ఏ కారణం చేతనైనా ఉదయం సమయంలో దీపారాధన వీలుపడకపోతే సాయంత్రం సమయంలో చేయవచ్చు అని చెబుతున్నారు. పగలు బాగా పని చేసి అలసి పోయిన వారు కాసేపు విశ్రాంతి తీసుకొని పూజ చేయడం మంచిది అని చెబుతున్నారు. కాబట్టి ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం సమయంలో ఎలాంటి సందేహాలు లేకుండా పూజ చేయవచ్చు అని చెబుతున్నారు