Peacock Feather: ఇంట్లో నెమలి పించం ఎక్కడ పెడితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?
నెమలి పించం ఇంట్లో కొన్ని దిశల్లో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:30 PM, Sun - 15 September 24

నెమలి ఎంత అందంగా ఉంటుందో దాని ఈకలు కూడా అంతే అందంగా ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది ఇంట్లో నెమలి పింఛంని అలంకరణ కోసం వినియోగిస్తూ ఉంటారు. మరి కొందరు వీటిని ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు. నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇల్లు మరింత అందంగా కనిపించడంతోపాటు ఆధ్యాత్మిక పరంగా కూడా అనేక లాభాలు వస్తాయని చెబుతున్నారు. అయితే ఇంట్లో నెమలి ఈకలను పెట్టుకోవడం మంచిదే కానీ ముఖ్యంగా కొన్ని దిశలలో పెట్టుకుంటే అదృష్టం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.
మరి ఏ దిశలో ఉంచితే అంతా మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెమలి పించం దుష్ట శక్తులను తొలగించి అదృష్టాన్ని తెస్తుందని చాలా మంది భావిస్తారు. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి పించాన్ని ఇంట్లో ఉంచడం వల్ల శుభం కలుగుతుందని చెబుతన్నారు. అనేక సంస్కృతులలో దీనిని ఒక శుభ చిహ్నంగా కూడా భావిస్తారట. వాస్తు నిపుణుల ప్రకారం నెమలి పించాన్ని లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారు. దీని ఇంట్లో ఉంచడం వల్ల దిన ధనవృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా నెమలి పించం ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుందని పాజిటివ్ శక్తులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు. నెమలి పించం ఇంట్లో ఉంచడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు.
అలాగే వాస్తు నిపుణుల ప్రకారం నెమలి పించం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ఆరోగ్య సమస్యలు ఉండవట. అంతేకాకుండా భార్య భర్తల మధ్య ప్రేమను పెంచుతుందని చెబుతున్నారు. నెమలి పించాన్ని ఇంట్లో ఉంచడం వల్ల శుభం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే, దీన్ని ఏ దిశలో ఉంచాలి అన్నది చాలా ముఖ్యం. వాస్తు నిపుణుల ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు. ఆ స్థానంలో నెమలి పించం ఉంచడం వల్ల ధనవృద్ధి ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈశాన్య దిశగా ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు. నెమలి పించంను ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. దీని వల్ల ఇంట్లో శాంతి ఉంటుంది. అలాగే దీన్ని ఎంతో గౌరవంగా చూడాలి. ఎక్కడ పడితే ఎక్కడ పడేకుండా చూసుకోవాలి. నెమలి పించం ను పూజ గదిలో ఉంచడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.