Parivarthan Ekadasi 2024 : నేడు పరివర్తన ఏకాదశి.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Parivarthan Ekadasi : మహా విష్ణువు ఏడాదిలో 4 నెలలు యోగనిద్రలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కుడి లేదా ఎడమ వైపున మాత్రమే శయనిస్తారు. ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఎడమవైపునకు నిద్రించే మహావిష్ణువు కుడివైపుకు తిరిగే కాలాన్నే పరివర్తన ఏకాదశి అంటారు.
- By Sudheer Published Date - 06:13 AM, Sat - 14 September 24

Parivarthan Ekadasi 2024 : నేడు పరివర్తన ఏకాదశి (Parivarthan Ekadasi ). సాధారణంగా ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి.. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి ఉంటుంది. అయితే ఈ భాద్రపద మాసంలో వచ్చిన శుక్ల పక్ష ఏకాదశిని.. పరివర్తన్ ఏకాదశిగా జరుపుకుంటాం. మహా విష్ణువు (Lord Vishnu) ఏడాదిలో 4 నెలలు యోగనిద్రలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కుడి లేదా ఎడమ వైపున మాత్రమే శయనిస్తారు. ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఎడమవైపునకు నిద్రించే మహావిష్ణువు కుడివైపుకు తిరిగే కాలాన్నే పరివర్తన ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించి భాద్రపదమాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు పరివర్తన చెందుతారు. కార్తికమాసంలో శుక్ల ఏకాదశినాడు నిద్ర నుంచి మేల్కొంటారు. శ్రీమహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించ వలసి వుంటుంది. వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని పురాణాలు చెపుతున్నాయి.
ఏకాదశి రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణకు కోటి రెట్ల అధిక ఫలితం
ఈ ఏడాది పరివర్తన ఏకాదశి ఈరోజు శనివారం వచ్చింది. మిగతా ఏకాదశుల మాదిరిగానే, పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై, పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీలక్ష్మీ నారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. చేమంతులతో నారాయణుని పూజించాలి. చక్ర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నివేదించాలి. పూజా చేసేవారు రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. సమీపంలోని విష్ణు ఆలయాలను సందర్శించాలి. ఈరోజు సాయంత్రం శుచిగా దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాదశి రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణకు కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి.
ఈ రోజు పప్పు ధాన్యాలు దానం ఇవ్వడం మంచిది
మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలను అనుసరించి పప్పు ధాన్యాలు దానం ఇవ్వాలి. ముఖ్యంగా మీ జాతకంలో బృహస్పతి దోషం ఉంటే ఈ రోజు పప్పు ధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది ..ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయి..ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలు పటాపంచలైపోతాయి. ఏకాదశి ఉపవాసం విరమించే సమయం దాన ధర్మాలకు అత్యుత్తమం..పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా మీకు అన్నీ శుభఫలితాలే ఉంటాయి.
Read Also : Narendra Modi : నేడు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..