Owl Statue: వాస్తు ప్రకారం ఇంట్లో గుడ్లగూబ విగ్రహం ఉండవచ్చా.. ఉంటే ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసా?
Owl Statue: వాస్తు ప్రకారం ఇంట్లో గుడ్లగూబ విగ్రహం ఉండవచ్చో ఉండకూడదో ఒకవేళ ఉంటే ఇంట్లో ఏ దిశలో పెట్టుకోవాలో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే గుడ్లగూబ విగ్రహం ఇంట్లో పెట్టుకునే ముందు ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Sat - 22 November 25
Owl Statue: గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అన్న విషయం తెలిసిందే. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. గుడ్లగూబ ధనం, ఐశ్వర్యం, బుద్ధికి చిహ్నం అని కూడా భావిస్తారు. కాగా గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోవడంతో పాటుగా ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్మకం. అదేవిధంగా ఇంట్లో గుడ్లగూబ విగ్రహం ఉంచడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే, అవకాశాలను గుర్తించే శక్తి లభిస్తుందట.
ఇది మీ ఆలోచనా సామర్థ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. వ్యాపార సంబంధిత విషయాలలో తరచుగా సమస్యలు ఎదుర్కొనే వారు తమ దగ్గర ఒక చిన్న గుడ్లగూబ విగ్రహాన్ని ఉంచుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో శుభ ఫలితాలను పొందడానికి గుడ్లగూబ విగ్రహం చాలా ప్రభావవంతమైనదని చెబుతున్నారు. ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న వారు గుడ్లగూబ విగ్రహం ఉంచితే ఉపశమనం లభిస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం గుడ్లగూబ విగ్రహాన్ని ఇంటికి ఉత్తరం లేదా పడమర దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారట.
ఉత్తర దిశ ధనం శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దిశగా చెబుతారు. ఇక పడమర దిశ స్థిరత్వాన్ని అందిస్తుందట. కాగా గుడ్లగూబ విగ్రహాన్ని ఇనుము, చెక్క లేదా వెండితో ఉన్నది కొనుగోలు చేయవచ్చట గుడ్లగూబ విగ్రహాన్ని ఎవరూ పదేపదే తాకలేని ప్రదేశంలో ఉంచాలని పండితులు చెబుతున్నారు. అలాగే ప్రతి శుక్రవారం, పౌర్ణమి రోజున గుడ్లగూబ విగ్రహాన్ని శుభ్రం చేసి, దాని ముందు దీపం వెలిగించాలట. ఇలా చేయడం వల్ల ధనం, అదృష్టం స్థిరంగా ఉంటాయని, గుడ్లగూబ విగ్రహం కేవలం అలంకరణ మాత్రమే కాదు ఇది మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించే ఒక శక్తివంతమైన వాస్తు పరిహారం అని చెబుతున్నారు పండితులు.