Vastu Tips: కొత్త ఏడాది ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకుంటే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
కష్టాలు, బాధలు అన్ని తొలగిపోయి వచ్చే ఏడాది నుంచి మీకు అంతా మంచే జరగాలి అంటే ఇంటికి కొన్ని రకాల మొక్కలను తీసుకొని రావాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:03 AM, Wed - 25 December 24

మరికొద్ది రోజుల్లోనే 2025 సంవత్సరం మొదలు కానుంది. ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం ఐశ్వర్యం సంతోషం శ్రేయస్సును తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఉంటారు. అయితే రాబోయే సంవత్సరం మీకు అంతా మంచే జరగాలంటే అందుకోసం కొన్ని రకాల పనులు చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త సంవత్సరం ప్రారంభంలో కొన్ని మొక్కలను ఇంటికి తీసుకురావడం వల్ల సంవత్సరం మొత్తం సిరిసంపదలతో సుఖ సంతోషాలతో ఉండవచ్చట. అలా మొక్కలు కొన్ని తీసుకురావడం వల్ల ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే అది తొలగిపోతుందట. ఇంతకీ ఇంటికి ఎలాంటి ముక్కలు తీసుకురావాలి అన్న విషయానికి వస్తే.. కొత్త సంవత్సరం ఇంటికి తీసుకురావాల్సిన మొక్కలలో తులసి మొక్క ఒకటి. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల సంవత్సరం మొత్తం చాలా శుభప్రదమని చెబుతారు.
ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. సిరి సంపదలకు లోటు ఉండదనీ చెబుతున్నారు. అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో జమ్మి మొక్క పెంచుకోవడం వల్ల శివుడు శని దేవుని అనుగ్రహం కలుగుతుందట. ఈ ఏడాది ప్రారంభంలో ఈ మొక్కను ఇంటికి తెచ్చుకుని నాటుకోవాలని చెబుతున్నారు. ఇలా నాటుకోవడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందట. ఇలా ఏడాది ప్రారంభంలో ఈ మొక్క ఇంటికి తీసుకురావడం వల్ల ఆనందం శ్రేయస్సు లభిస్తుందని చెబుతున్నారు. వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ ఆనందం, శ్రేయస్సు కు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటి ఆగ్నేయ మూలలో పెంచుకోవాలి. ఇంటి ఆర్థిక పురోగతికి మనీ ప్లాంట్ కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ మొక్కను కూడా కొత్త సంవత్సరం రోజు ఇంటికి తీసుకుని రండి.
వాస్తు శాస్త్రం ప్రకారం శ్వేతార్క మొక్క అంటే జిల్లేడు మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగా పరిగణింపబడుతున్నది. ఈ మొక్క గణపతికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం వలన సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయని.. అలాగే నెగటివ్ ఎనర్జీ నశింపజేయడంలో ఈ మొక్క ఉపయోగపడుతుందని చెబుతారు. కొత్త సంవత్సరంలో ఇంట్లో ప్రతికూల శక్తిని తొలిగించుకోవడానికి జిల్లేడు మొక్కను పెంచుకోవాలని చెబుతున్నారు.