Naga Kesari: ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. కాసుల వర్షమే?
సాధారణంగా మన జీవితంలో ఎదుర్కొనే కష్టాలకు ఆర్థిక సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణం అన్న విషయం
- By Nakshatra Published Date - 06:00 AM, Wed - 15 March 23

సాధారణంగా మన జీవితంలో ఎదుర్కొనే కష్టాలకు ఆర్థిక సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణం అన్న విషయం మనందరికీ తెలిసిందే. వాస్తు ప్రకారంగా కొన్ని రకాల పరిహారాలను పాటించడం వల్ల ఆ కష్టాల్లో నుంచి సమస్య నుంచి బయటపడవచ్చు. భారతదేశంలోని హిందువులు వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. కేవలం వస్తువులు మొక్కల విషయంలో మాత్రమే కాకుండా ఇంటి నిర్మాణ దశ ఇంటి వాస్తు విషయంలో కూడా తప్పకుండా వాస్తు చిట్కాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పరుగులు తీస్తూ ఉంటారు.
అంతేకాకుండా కష్టపడి రాత్రి పగలు ఒక పని చేస్తూ ఉంటారు. కష్టపడి పని చేస్తూ వాస్తు విషయాలను కూడా పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి వాస్తు ప్రకారం గా కూడా కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. అప్పుడే ఆర్థిక సమస్యలు దూరం అయ్యి సమాజంలో కూడా గౌరవం కూడా పెరుగుతుంది. ఇందుకోసం నాగ కేసర పువ్వుని ఉపయోగించాలి. ఆర్ధిక అవరోధాలు పోవాలంటే శుక్ల పక్షం శుక్రవారం రాత్రి ఒక చిన్న వెండి బాక్సులో నాగకేసర పువ్వు, కొంచెం తేనే కలిపి బాక్సు మూసివేయాలి.
ఆ తర్వాత ఆ బాక్స్ ను బీరువాలో పెడితే మీకు కొన్ని రోజుల్లోనే డబ్బు వస్తుంది. ఈ పువ్వులు శివుడికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి అందుకే సోమవారం శివుడికి పూజ చేసేటప్పుడు వీటిని సమర్పిస్తే దోషాలు ఉన్న కూడా తొలగిపోతాయి. అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. పరమేశ్వరునికి కేసర పువ్వు సమర్పించడం వల్ల మీరు కోరుకున్న కోరికలను నెరవేర్చడంతో పాటు మీకు ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుంది.

Related News

Hanuman Blessings: హనుమంతుడి వరాలు పొందాలంటే.. ఈ పూజలు చేయండి
శక్తి, మేధస్సు, జ్ఞానం యొక్క మహాసముద్రంగా హనుమంతుడిని పిలుస్తారు.. ఆయన ఆశీర్వాదం పొందడానికి.. ప్రతి మంగళవారం రోజున చేసే పూజ చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు.