Pooja: దేవుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ కలలు నెరవేరడం కష్టం!
పూజలు చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు పాటించడం అన్నది తప్పనిసరి. హిందూమతంలో దేవుళ్లను దేవతలను పూజించడానికి కొన్ని నిర్దిష్ట నియమాలు రూపొందించబడ్డాయి. వాటిని తప్పకుండా పాటించాలని పండితులు కూడా చెబుతూ ఉంటారు.
- By Anshu Published Date - 12:00 PM, Sat - 20 July 24

పూజలు చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు పాటించడం అన్నది తప్పనిసరి. హిందూమతంలో దేవుళ్లను దేవతలను పూజించడానికి కొన్ని నిర్దిష్ట నియమాలు రూపొందించబడ్డాయి. వాటిని తప్పకుండా పాటించాలని పండితులు కూడా చెబుతూ ఉంటారు. అలా కాకుండా పూజ విషయంలో మనం చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే అనేక రకాల సమస్యలకు కారణమవుతాయి అంటున్నారు. ఈ నియమాలను విస్మరించిన వారికి ఏళ్ల తరబడి పూజలు చేసినా పూజ ఫలాలు లభించవట. కాబట్టి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు పండితులు.
మరి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏ దేవతను పూజించేటప్పుడు, దీపం నీటి కుండను కలిపి ఉంచకూడదట. అలాగే పూజకు ఉపయోగించే కలశం లేదా నీటి పాత్రను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. దేవతలకు దీపం ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో అంటే అగ్ని కోణంలో ఉంచాలి. దేవుడిని పూజించేటప్పుడు వాడిన, వాడిపోయిన లేదా కుళ్ళిన పువ్వులు సమర్పించకూడదట. అలాగే ఎల్లప్పుడూ వికసించే పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి. అలాగే ఏ దేవత పూజలో నిషిద్ధమని భావించే పూలను ఎప్పుడూ ఉపయోగించకూడదట. హిందూ మతంలో ఏ దేవత పూజలోనైనా ఆసనాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.
కాబట్టి దేవతా ఆరాధనలో ఒక నిర్దిష్ట దేవత లేదా నవగ్రహానికి సంబంధించిన రంగుల ఆసనాన్ని ఎల్లప్పుడూ ఉపయోగించాలని చెబుతున్నారు పండితులు. నేలపై కూర్చొని పూజలు చేసిన వారికి ఫలితం ఉండదట. దేవుణ్ణి ఆరాధించడంలో ఎప్పుడూ గర్వం లేదా కీర్తిని పొందవద్దు. దేవతల పూజలలో ఉపయోగించే వస్తువుల గర్వం ప్రదర్శన వాటి ఫలితాలను ఇవ్వదని నమ్ముతారు. భగవంతుని పూజించేటప్పుడు నిర్మలమైన మనసుతో దేవుడిపై శ్రద్ధ పెట్టి చేయాలట. భగవంతుడికి పూజ చేసేటప్పుడు మనసులో కానీ ఆలోచనలో కానీ పొరపాటున కూడా ఇలాంటి ఇవి రాకూడదని చెబుతున్నారు. భగవంతుడిని పూజించడం వల్ల మనసులో తప్పుడు భావోద్వేగాలు వస్తే ఫలితం ఉండదనే విశ్వాసం బలంగా ఉంది.