Monkey : శివయ్య అంటూ తన భక్తిని చాటుకున్న వానరం..
Monkey : ఓ కోతి శివలింగంపై తలపెట్టి వేడుకున్నట్లు కనిపించింది. ఇది చూసి భక్తులంతా కోతి భక్తికి ఫిదా అయ్యారు
- By Sudheer Published Date - 11:39 AM, Tue - 12 November 24

ఓ కోతి (Monkey ) ..శివలింగం (Shiv Lingam) వద్ద తన భక్తిని చాటుకుంది. కార్తీకమాసం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శివలింగం వద్ద భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉంచిన ప్రసాదాలు, అరటిపండ్లను వానరాలు ఆరగించాయి. వాటిల్లో ఓ కోతి శివలింగంపై తలపెట్టి వేడుకున్నట్లు కనిపించింది. ఇది చూసి భక్తులంతా కోతి భక్తికి ఫిదా అయ్యారు. తమకు ఆహారం అందజేసినందుకు ఇలా శివయ్యకు ధన్యవాదాలు చెప్పుకుంది కావొచ్చు అని మాట్లాడుకున్నారు.
కార్తీకమాసం పర్వదినం హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా శివభక్తులకు. ఈ మాసంలో అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. భక్తులు కార్తీకమాసాన్ని శివుని ఆరాధనకు అత్యంత శ్రేష్ఠమైన సమయంగా భావిస్తారు. పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించేందుకు గుడులకు వెళ్తుంటారు. కార్తీకమాసంలో చేయబడే దీపారాధన, రుద్రాభిషేకం, పరమానంద వ్రతాలు, మరియు వ్రతాలు శివుని అనుగ్రహాన్ని పొందడానికి ముఖ్యమైనవి. భక్తులు ఈ మాసంలో ప్రత్యేకంగా రుద్రపారాయణం, కార్తీక దీపాలు వెలిగించడం, కార్తీక సోమవారం ఉపవాసాలు చేయడం వంటి ఆచరణలను పాటిస్తారు.
కార్తీక మాసం (Karthika Masam)లో శివభక్తికి ప్రాముఖ్యత:
కార్తీక సోమవారాలు: ప్రతి సోమవారం శివుని పూజతో పాటు ఉపవాసం చేయడం శివుని కృపను పొందుతుందని విశ్వసిస్తారు.
నదీ స్నానాలు: కార్తీకమాసంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం పుణ్యఫలదాయకంగా భావిస్తారు.
దీపములు వెలిగించడం: ప్రతి రోజు సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా పాప పరిహారం జరుగుతుందని, పుణ్యం సమకూరుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఎక్కువగా ఈ మాసంలో శివయ్యను కొలుస్తుంటారు. కేవలం మనుషులే కాదు వన్యప్రాణాలు కూడా భక్తిలో నిమగ్నమై పోతాయి అనడానికి ఈ వానరనమే నిదర్శనం.
Read Also : Dogs Attack : కేసులు మీద కాదు కుక్కల మీద దృష్టి పెట్టండి – ప్రభుత్వానికి అంబటి సూచన