Matti Pramida Deepam : మట్టి ప్రమిదలలో వెలిగించే దీపానికి ఎందుకు అంత ప్రాధాన్యత..
Matti Pramida Deepam : ఇది కేవలం పండుగ మాత్రమే కాదు అంధకారాన్ని తొలగించి, మనలోని చెడు లక్షణాలను కూడా తొలగించే ఒక ఆధ్యాత్మిక సాధనగా దీపాన్ని పరిగణిస్తారు
- By Sudheer Published Date - 08:16 PM, Fri - 25 October 24

దీపావళి (Diwali) అనగానే ఏముంది ఇంటి ముందు దీపం (Deepam) వెలిగించాలి..టపాసులు కాల్చాలి.అంతే కదా అని చాలామంది భావిస్తారు. కానీ దీపం వెలిగించటమంటే ప్రమిద (Matti Pramida)లో ఒత్తి వేసి వెలిగించి టాపాసులు కాల్చుకోవడం మాత్రమే కాదు. దానికి కొన్ని నియమాలు.. నిబంధనలు కూడా ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో దీపానికి చాలా విశిష్టత ఉంది.
దీప” అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. దీప + ఆవళి అంటే.. దీపాల వరుస అని అర్థం. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు అంధకారాన్ని తొలగించి, మనలోని చెడు లక్షణాలను కూడా తొలగించే ఒక ఆధ్యాత్మిక సాధనగా దీపాన్ని పరిగణిస్తారు. దీపాన్ని శ్రద్ధతో, భక్తితో వెలిగించడం ద్వారా మానసికంగా మరియు శారీరకంగా శాంతిని అనుభవించవచ్చు.
మట్టి ప్రమిద(Matti Pramida)లో నువ్వుల నూనెను ఉపయోగించడం మన పూర్వజన్మ కర్మలను శుభ్రం చేయడానికి, అదనంగా శరీరానికి ఉపయోగపడే ఉపకారం కూడా కలిగిస్తుంది. కొవ్వొత్తులు వాడకూడదనే విషయం ముఖ్యంగా ఆధ్యాత్మికంగా తృణీకరించవలసిన ప్రతికూల శక్తులను మన నివాసాలకు దూరం పెట్టేందుకు సహాయపడుతుంది. మూడు వత్తుల ప్రమిదను వెలిగించడం ఆధ్యాత్మికంగా శుభప్రదంగా భావిస్తారు. ఈ విధంగా దీపాన్ని మూడింటిని (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) ప్రతీకగా పరిగణించి, శ్రద్ధతో వెలిగించడం ద్వారా జీవనంలో శాంతి, సుఖం మరియు ఐశ్వర్యం లభిస్తాయి.
Read Also : Gum Care : వృద్ధుల చిగుళ్లను ఎలా బలోపేతం చేయాలి? ఆహారంలో ఏయే పదార్థాలు చేర్చుకోవాలి..!