Mouni Amavasya: మౌని అమావాస్యతో ఈ రాశుల వారి దశ తిరగడం ఖాయం.. పట్టిందల్లా బంగారమే!
ఈ మౌని అమావాస్య నుంచి కొన్ని రాశుల వారికి అంతా మంచి జరుగుతుందని, రాజయోగం పట్టబోతోంది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:35 AM, Sun - 26 January 25

ఈ అమావాస్య చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తున్నారు. ఈ మౌని అమావాస్య రోజున పవర్ఫుల్ త్రివేణి యోగం ఏర్పడబోతోందట. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెబుతున్నారు. ఈ అమావాస్య తర్వాత వారి దిశ మారబోతోందట. అనుకున్న పనులు విజయం అవడంతో పాటు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మకర రాశి.. ఈ త్రివేణి యోగం వల్ల మకర రాశివారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారట. అంతేకాకుండా వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక మార్పులు చూస్తారని చెబుతున్నారు. అలాగే పనుల్లో పురోగతి లభించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారట. అలాగే మకర రాశివారికి జీవితంలో సానుకూల మార్పులు కూడా విపరీతంగా వస్తాయని చెబుతున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయట. వైవాహిక జీవితం కూడా చాలా ఆనందకరంగా ఉంటుందని,అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు..
తులారాశి.. త్రివేణి యోగం కారణంగా తులారాశి వారికి విశేష లాభాలు కలగబోతున్నాయట. వీరికి జీవితంలో భౌతిక ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుందట. అలాగే ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట. వీరికి భౌతిక ఆనందం కూడా రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. తులారాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కుంటుంబంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుందట. దీంతో పాటు వీరు కొత్త ఇళ్ళు, ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారట. అలాగే ఉద్యోగాలు చేసేవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా వీరికి తల్లితో అనుబంధం కూడా పెరుగుతుందట.
వృషభరాశి.. త్రివేణి యోగం ఏర్పడడం వల్ల వృషభ రాశివారికి మతపరమైన విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుందట. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయట. కోరికలు కూడా నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయట. వ్యాపారాలు చేసేవారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయని ఈ అమావాస్య నుంచి ఈ రాశి వారికి కూడా అదృష్టం కలిసి రాబోతుందని పండితులు చెబుతున్నారు.