Dreams: అలాంటి కల వస్తే ఆరు నెలల్లో చనిపోతారట?
సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పీడకలు వేస్తే మరికొన్నిసార్లు మంచి మంచి కలలు వస్తూ ఉంటాయి. అయిత
- Author : Anshu
Date : 28-05-2023 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పీడకలు వేస్తే మరికొన్నిసార్లు మంచి మంచి కలలు వస్తూ ఉంటాయి. అయితే కలలో మనకు మూడు రకాల కలలు వస్తూ ఉంటాయి. జరిగిపోయినవి జరుగుతున్నవి, జరగబోయేవి. స్వప్నశాస్త్ర ప్రకారం కలలో ఎప్పుడూ కూడా భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అయితే చాలావరకు మనకు కలలో వచ్చిన వస్తువులు కానీ మనకు వచ్చిన కలను కానీ మర్చిపోతూ ఉంటాము. కేవలం కొన్ని రకాల కలలు మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం.
అయితే మనకు మరణం వచ్చే ముందు కలలో పలు సంకేతాలు, సూచనలు కనిపిస్తాయట. ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తథ్యం అని శివపురాణం చెబుతోంది. శివపురాణం ప్రకారం, పార్వతి దేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది. స్వామి..! మరణానికి సంకేతం ఏంటి, మరణం రాబోతోందని ఎలా తెలుస్తుందని ప్రశ్నించగా అప్పుడు పరమ శివుడు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు, కొద్దిగా ఎరుపు రంగులో మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలలో చనిపోవచ్చని అర్ధం. నీరు, నూనె, అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడు.
ఈ సమయం కన్నా ఒక నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తాము చూసుకోలేరు ఒకవేళ కనిపించినా ఆ నీడకు తలభాగం ఉండదు. ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే లోకాన్ని వీడిబోతున్నాడని అర్థం. అలాగే వారం రోజుల పాటు ఎడమ చేయి మెలితిరిగిపోతున్నట్లు అనిపిస్తున్నా కూడా త్వరలో మరణం తథ్యం అని అర్థం. అదేవిధంగా నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో ప్రాణం కోల్పోతాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని కాంతిని చూడలేనప్పుడు ఇక జీవించేది ఆరు నెలలే నాలుక అకస్మాత్తుగా ఉబ్బి, దంతాల్లో చీము వస్తే ఆరు నెలలకు మించి బతకరు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఎరుపు రంగులోనే కనిపించినా మరణ సమీపించినట్టే అని అర్థం. గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు, ఏదైనా గ్రామాన్ని ఖాళీగా కానీ ధ్వంసం చేసినట్టు కానీ కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్టే. అలాగే పావురం, కాకి, గద్ద తలపై కూర్చున్నా, వాలినా కూడా అది మరణ సంకేతంగా భావించాలి. చనిపోయే ముందురోజు పార్వతీ పరమేశ్వర్లు కలలో పరామర్శిస్తారట. మరణానికి ముందురోజు యమభటులు కల్లో కనిపించి పేరు అడుగుతారు. రెండు పిచ్చుకలు నీళ్లలో మునగితేలినా మీ ప్రాణం గాల్లో కలిపోతుందని సంకేతమే. తీతువు పిట్ట ఇంటిపైనుంచి వెళ్లినా మరణానికి చేరువలో ఉన్నామన్న సంకేతమే.