Monday: సోమవారం రోజు కచ్చితంగా చేయాల్సిన పనుల గురించి వాటి వల్ల కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా?
శివయ్య అనుగ్రహం కోసం సోమవారం రోజు తప్పకుండా కొన్ని రకాల పనులు చేయాలనీ, దాంతో పరమేశ్వర అనుగ్రహం కలగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 14 March 25

సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈరోజున పరమేశ్వరున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తొందరగా లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే కోరికలు కూడా త్వరగా నమ్ముతూ ఉంటారు. అయితే శివానుగ్రహం కలగాలి అంటే సోమవారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి అనుకునేవారు పంచామృతంతో పరమేశ్వరుని పూజించాలట. ఆ తర్వాత పంచాక్షరీ మంత్రం “ఓం నమః శివాయ” అనే శివ మంత్రాలను పఠించాలని చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడుతుందట. అలాగే వీరి బంధం మధురంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు శివ పూజ వల్ల డబ్బుకు కూడా ఎలాంటి లోటూ ఉండదట. అలాగే మన జీవితంలో ఏదైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం రోజు శివ చాలీసా అలాగే శివ మంత్రాలని పఠించాలని చెబుతున్నారు. ఈ పరిహారం చేయడం వల్ల జీతంలో వచ్చే అన్ని సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుందట.
అదేవిధంగా సోమవారం రోజు బ్రహ్మ ముహూర్తములో నిద్ర లేచిన శివుడికి ధ్యానం చేయాలట. ఆ తర్వాత శివుడిని పూజించాలట. ఆపై ముడి బియ్యాన్ని ఒక పేద వ్యక్తికి భక్తితో దానం చేయాలట. ఈ పరిహారాన్ని చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడట. జాతకంలో బలమైన చంద్రుడు ఉండటం వల్ల ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడని చెబుతున్నారు. అదేవిధంగా సోమవారం రోజు శివారాధన సమయంలో శివ స్తోత్రాన్ని తప్పనిసరిగా పటించాలని, ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకున్న ప్రతి జబ్బులు, రోగాలు అన్ని నయమవుతాయని చెబుతున్నారు. కాబట్టి సోమవారం రోజు పైన చెప్పిన పరిహారాలు పాటిస్తే జీవితంలో తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు పండితులు..