Things – Must Pay : ఈ వస్తువులు ఫ్రీగా తీసుకుంటే ఇక ఇక్కట్లే
Things - Must Pay : ఇంట్లో ఏదైనా వస్తువు, సరుకు అయిపోతే.. ఇరుగుపొరుగు వారిని, దగ్గర్లో ఉన్న బంధువులను అడిగి తెచ్చుకుంటూ ఉంటారు.
- Author : Pasha
Date : 10-09-2023 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
Things – Must Pay : ఇంట్లో ఏదైనా వస్తువు, సరుకు అయిపోతే.. ఇరుగుపొరుగు వారిని, దగ్గర్లో ఉన్న బంధువులను అడిగి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి టైంలో కొన్ని వస్తువులను డబ్బులివ్వకుండా తీసుకోకూడదని పెద్దలు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం..
పూజా సామగ్రి
పొరపాటున కూడా పూజా సామగ్రిని ఎవరి దగ్గరా ఉచితంగా తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే పూజకు తగిన ఫలం లభించదు. దానివల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.
పాలు
పాలను దానంగా స్వీకరించకూడదు. ఇతరులకు ఇవ్వకూడదు. డబ్బులతోనే పాలు కొనాలి. పాలను ఫ్రీగా తీసుకుంటే ఇంట్లో ఇంటిలో అప్పుల భారం పెరుగుతుంది.
Also read : Chandrababu Sit Office : సిట్ విచారణ రూమ్ లో జగన్ మనుషులకేం పని..?
నూనె
నూనెను దానంగా తీసుకోకూడదు. దానం ఇవ్వకూడదు. ఫ్రీగా నూనె తీసుకుంటే.. ఇంట్లో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాన్ని కూడా అనుభవిస్తారు. శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆవ నూనె తీసుకోకూడదు, ఇవ్వకూడదు. తీసుకుంటే శని దేవుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
సూది
సూది అనేది ఇనుము వస్తువు. అది శనికి ప్రతిరూపం. సూదిని డబ్బులు ఇవ్వకుండా తీసుకోకూడదు. అలాంటి సూది వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా తీసుకున్న వ్యక్తుల మధ్య విభేదాలు పెరుగుతాయి.
ఇనుము
ఫ్రీగా ఎవరి నుంచి కూడా ఇనుమును తీసుకోకూడదు. ఎందుకంటే అది శనిదేవునికి సంబంధించిన లోహం. ఫ్రీగా వచ్చే ఇనుము ఇంట్లో అశాంతిని క్రియేట్ చేస్తుంది. ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. సంపాదన హరించుకుపోతుంది.