Goddess Lakshimi: మీ ఇంట్లో ఈ తప్పులు పొరపాటున చేశారో..లక్ష్మీ దేవి ఆగ్రహం తట్టుకోలేరు…!!
జీవితంలో మిగతా సమస్యలకంటే ఎక్కువగా...ఆర్థిక సమస్యలు వేధిస్తుంటాయి...బాధిస్తుంటాయి. అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే...అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాల్సిందే.
- Author : hashtagu
Date : 23-06-2022 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
జీవితంలో మిగతా సమస్యలకంటే ఎక్కువగా…ఆర్థిక సమస్యలు వేధిస్తుంటాయి…బాధిస్తుంటాయి. అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే…అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాల్సిందే. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడచుకోవాలి. పాలు..పూలు…పసుపు..కుంకుమ…దీపం…గోవు…ధనం…ధాన్యం…ఇవన్నీ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెబుతుంటారు. అందుకే వాటి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉంది. వాటి విషయంలో ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఇక బాగా పొద్దుపోయేవరకు నిద్రించేవారి ఇళ్లలోనూ…సాయంత్రం వేళ నిద్రించి వారి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదట. కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని గడిపేవారి ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది. ఇక ఎప్పుడూ చూసినా కలహాలతో ఉండే ఇళ్లలోనూ లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదట. ఎక్కడైతే పవిత్రత…ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనేది ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.