Krishna Janmashtami 2022: ఈ ఏడాది శ్రీకృష్ణజన్మాష్టమి ఎప్పుడు వస్తుంది..ఈ మంత్రం జపిస్తే…కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది..!!
శ్రావణం తర్వాత భాద్రపద మాసం వస్తుంది. భాద్రపదలో అనేక ప్రధాన పండుగలు వస్తాయి, అందులో శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఒకటి. హిందూమతంలో కృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
- By hashtagu Published Date - 06:00 AM, Sun - 10 July 22
శ్రావణం తర్వాత భాద్రపద మాసం వస్తుంది. భాద్రపదలో అనేక ప్రధాన పండుగలు వస్తాయి, అందులో శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఒకటి. హిందూమతంలో కృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీ కృష్ణుడు భాద్రపద కృష్ణ పక్షం అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని పురాణాల్లో ఉంది. అందువల్ల, ప్రతి సంవత్సరం కృష్ణ జన్మోత్సవాన్ని భాదో కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది శ్రీకృష్ణజన్మాష్టమి ఏ రోజున వస్తుంది..శుభ ముహుర్తం ఎప్పుడు ఉంది. పూజా విధానం గురించి తెలుసుకుందాం.
శ్రీకృష్ణజన్మాష్టమి శుభ సమయం:
జన్మాష్టమి నాడు శ్రీకృష్ణునికి ఎన్నో రకాల పూజలు చేస్తుంటారు. అయితే పూజలు నిర్వహించేందుకు శుభముహుర్తం చేస్తుంటారు. ఈ ఏడాది ఆగస్టు 18న శ్రీకృష్ణజన్మాష్టమి వస్తుంది. మధ్యాహ్నం 12:05 నుండి 12:56 వరకు అభిజీత్ ముహూర్తం ఉంటుంది. ఆగస్టు 18 రాత్రి 08:41 నుండి ఆగస్టు 19 రాత్రి 08:59 వరకు ధ్రువ యోగం ఉంటుంది.
శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా విధానం:
కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి మడి బట్టలు ధరించాలి. ఆ తర్వాత ఇంటితోపాటుగా పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపలకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరములో ముగ్గులు వేయాలి. శ్రీ కృష్ణుడిని అలంకరించిన తరువాత, అష్టగంధ గంధం, అక్షతం రోలి యొక్క తిలకం వేయాలి. శ్రీ కృష్ణుని ప్రత్యేక మంత్రాలను జపించాలి. నిమజ్జనం కోసం, పువ్వులు బియ్యం చేతిలో తీసుకొని వాటిని బయట వదిలేస్తూ ఓ శ్రీకృష్ణా! పూజకు వచ్చినందుకు ధన్యవాదాలు అని మనస్సులో అనుకోండి. అయితే శ్రీకృష్ణుడికి పూజ నిర్వహించేటప్పుడు పూజలో నలుపు లేదా తెలుపు రంగులను ఉపయోగించవద్దు. కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన వైజయంతీ పుష్పాలను సమర్పించడం ఉత్తమం.
శ్రీకృష్ణజన్మాష్టమి నైవేద్యాలు:
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉంటారు. సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.
సంతానం లేనివారు..
సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈరోజున బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు! ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః! ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః!కాగా ఈ మంత్రాన్ని ఈ రోజు ఎవరైతే 108 సార్లు ధ్యానం చేస్తుంటారో వారి దుఃఖం హరించిపోతుంది.
Related News
Hanuman Puja: మంగళవారం రోజు హనుమాన్ పూజలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే?
హిందూ ధర్మంలో వారంలో ఒకొక్క రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అలా మంగళవారం హనుమంతుడి అంకితం చేయబడింది. కాబట్టి మంగళవారం