Karthika Masam: కార్తీకమాసంలో శుక్రవారం రోజు ఇలా దీపారాధన చేస్తే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!
కార్తీక మాసంలో శుక్రవారం రోజు ప్రత్యేకంగా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:20 PM, Tue - 19 November 24

కార్తీకమాసంలో వచ్చే శుక్రవారానికి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక శుక్రవారం రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవి, పార్వతీ దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, సంపద కూడా పెరుగుతుందని చెబుతున్నారు. కాగా ఈ కార్తీక శుక్రవారం పూట కొన్ని పనులను కచ్చితంగా చేయాలట. అలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కార్తీక శుక్రవారం రోజున తప్పకుండా చేయాల్సిన పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కార్తీక శుక్రవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి, ఉతికిన బట్టలనే ధరించాలట. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండాలట. ఉపవాసం ఉన్న వారు ఒకపూట మాత్రమే భోజనం చేయాలని, మిగిలిన రెండు పూట్ల పండ్లు, పండ్ల రసాలను, కొబ్బరితో కూడిన ఆహారాన్నితీసుకోవాలని చెబుతున్నారు. కార్తీక శుక్రవారం రోజున మహిళలు తెలుపు రంగులో ఉండే పూలను, కనకంబరాలను గాను ధరించి లక్ష్మీదేవి, పార్వతీ దేవిలను పూజిస్తే దీర్ఘసుమంగళిగా జీవిస్తారని నమ్మకం. ఇక ఇదే రోజున సాయంకాలం అంటే సంధ్యా వేళలో ఇంట్లో దీపాలను వెలిగించాలట.
ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని ధనలక్ష్మీ ఇంట్లో వచ్చి నివాసం ఉంటుందని చెబుతున్నారు. అయితే దీపాలను వెలిగించినప్పుడు తప్పకుండా కొన్ని మంత్రాలను పఠించాలట. “చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్’’ అనే మంత్రాన్ని జపించాలని చెబుతున్నారు. కార్తీక శుక్రవారం నాడు సంధ్యా వేళలో ఈ మంత్రాలను పఠిస్తూ అమ్మవారి ఫొటో లేదా విగ్రహం ఎదుట దీపారాధన చేస్తే సిరి సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి చెట్టు ముందు దీపాలను వెలిగించాలట.
అన్ని దీపాలను మట్టితో తయారు చేసినవే అయ్యుండాలట. అలాగే ప్రమిదలలో నెయ్యి వేసి దీపాలను వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఎవరి ఇంటి ముందు శుక్రవారం పూట సాయం కాలం వేళ దీపాలు వెలుగుతూ ఉంటాయో, ఆ ఇంట ధనలక్ష్మీ ప్రవేశిస్తుందట.కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవి, పార్వతీదేవి దేవాలయాలకు వెళ్లి దర్శించుకుంటే శుభ ఫలితాలు వస్తాయని,అలాగే అమ్మవారికి మల్లెపువ్వులు లేదా పూల మాలలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.