Sunset : సూర్యాస్తమయం సమయంలో అవి కనిపిస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం?
ఆ సంగతి పక్కన పెడితే సూర్యాస్తమయం (Sunset)లో కొన్ని రకాల వస్తువులు చూడడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలిగి ధనవంతులు అవుతారట.
- By Naresh Kumar Published Date - 07:40 PM, Thu - 23 November 23

Sunset : ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు కావాలని లక్షలు సంపాదించాలి అని కోరుకుంటూ ఉంటారు. కొందరికి అదృష్టం ఒకేసారి తడితే మరి కొంతమంది మాకు అదృష్టం లేదు కలిసి రాదు అని దిగులు చెందుతూ ఉంటారు. అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారు చాలామంది ఉన్నారు. అయితే మనం అనుభవించే కొన్ని రకాల సమస్యలకి వాస్తు కూడా కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ సంగతి పక్కన పెడితే సూర్యాస్తమయం (Sunset)లో కొన్ని రకాల వస్తువులు చూడడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలిగి ధనవంతులు అవుతారట. ఇదే విషయాన్ని వాస్తు శాస్త్రం కూడా చెబుతోంది. మరి సాయంత్రం సమయంలో ఎటువంటి వస్తువులు చూడడం వల్ల ధనవంతుల అవుతారో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
ఒకవేళ మీ ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకొని ఉంటే అది శుభశకునంగా భావించాలి. ఇలా ఆ పిచ్చుకలు గూడు కట్టుకున్న ఇండ్లలో సంతోషాలు వెళ్లి విరుస్తాయి. ధనం సంపదలో రాక కూడా అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. సూర్యాస్తమయం (Sunset) సమయంలో ఇంట్లో ఒకేసారి మూడు బల్లులని చూస్తే అది శుభ సూచకంగా భావించాలి. అలా కనక జరిగితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని భావించాలి. అలాగే త్వరలోనే డబ్బులు కూడా రాబోతున్నాయని అర్థం. అలా కనిపించాయి అంటే ఆ వ్యక్తి కూడా ఆర్థికపరమైన సమస్యలు అన్ని సమస్యలు దూరం అవుతాయని అర్థం.. సూర్యాస్తమయం (Sunset) తరువాత ఎవరి ఇంట్లోనైనా భారీగా నల్ల చీమలు కన్పించినా అత్యంత శుభప్రదంగా భావించాలి.
నల్ల చీమల దండు కనిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం వెంటనే కలగుతుంది. అందుకే నల్ల చీమలకు ఆహారం పెట్టామని చెబుతూ ఉంటారు. చీమలకు ఆహారంగా పిండి లేదా పంచదార వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమౌతుందట. మీకు కలలో బల్లి, గుడ్లగూబ, చీపురు వంటివి కన్పిస్తే అత్యంత శుభమని అర్ధం. ఇలా జరిగితే త్వరలోనే మీకు అంతులేని డబ్బులు లభిస్తాయంటారు.
Also Read: Lakshmi : లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి మెయిన్ డోర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?