Sita Navami 2025: ఈరోజే సీతా నవమి.. పూజ ఎలా చేయాలి ? దీన్ని ఎందుకు జరుపుకుంటారు ?
సీతా నవమి(Sita Navami 2025) రోజున భక్తులు ఉపవాసం ఉంటారు.
- By Pasha Published Date - 09:15 AM, Mon - 5 May 25

Sita Navami 2025: మనం ఏటా సీతా నవమిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఈసారి సీతా నవమి ఎప్పుడు ? మే 5న జరుపుకోవాలా ? మే 6న జరుపుకోవాలా ? అనే సందేహం చాలామందికి వస్తోంది. సీతా నవమి పండుగని ప్రతీ సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష నవమి నాడు జరుపుకుంటారు. వైశాఖ మాస శుక్లపక్ష నవమి ఈరోజే (సోమవారం – మే 5న). దీన్నే మనం సీతానవమి అని పిలుస్తాం. సీతా నవమి ఈరోజు ఉదయం 7:36 గంటలకు మొదలై, మంగళవారం (మే 6న) ఉదయం 8:39 గంటల వరకు కొనసాగుతుంది. అందుకే ఈసారి సీతానవమిని మే 5వ తేదీనే జరుపుకోవాలి.
సీతానవమి నేపథ్యం ఇదీ..
వైశాఖ మాస శుక్లపక్ష నవమి రోజున జనక మహారాజు సంతానం కోసం యాగ భూమిని సిద్ధం చేయడానికి నాగలితో భూమిని దున్నుతున్నాడు. ఆ సమయంలో భూగర్భంలో సీతాదేవి మానవ రూపంలో కనిపించింది. అందుకే సీతా నవమి నాడు సీతాదేవి జన్మదినాన్ని జరుపుకుంటారు.
Also Read :Igla S Missiles: టార్గెట్ పీఓకే.. ‘ఇగ్లా-ఎస్’లను రంగంలోకి దింపుతున్న భారత్
సీతా నవమి రోజున ఏం చేస్తారు ?
- సీతా నవమి(Sita Navami 2025) రోజున భక్తులు ఉపవాసం ఉంటారు.
- ఈరోజు సీతాదేవిని ఆరాధించి అనుగ్రహం పొందొచ్చు.
- ఈరోజు (మే 5న) ఉదయం 7:30 నుంచి సీతాదేవిని ఆరాధించొచ్చు.
- వాస్తవానికి సీతాదేవి నవమి తిధి నాడు మధ్యాహ్నం టైంలో జన్మించింది. అందుకే అభిజిత్ ముహూర్తంలో పూజించడం శుభప్రదం.
- ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12 45 వరకు ఉంది. ఈరోజు అమృతకాలం 12:20 నుంచి 12:45 వరకు ఉంది. ఈ టైంలలో సీతాదేవిని ఆరాధించడం ఉత్తమం.
- ఉపవాస ప్రతిజ్ఞ చేసిన తర్వాత సీతాదేవి పూజ చేయడం మొదలు పెట్టాలి.
- సీతాదేవికి పువ్వులు, దండలు, బియ్యం, ధూపం, దీపం, పండ్లు మొదలైన సమర్పించాలి.
- నువ్వుల నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేయాలి.
- దీపం వెలిగించిన తర్వాత సీతాదేవి 108 నామాలను జపించాలి. సీతా చాలీసా పఠించాలి.
- ఈరోజు సాయంత్రం సీతాదేవికి పూజ చేసి హారతి ఇవ్వాలి.
- శ్రీరాముడి చిత్రపటాన్ని పెట్టి, ఆ తర్వాత గంగాజలాన్ని పూజా స్థలంలో జల్లాలి.