Tirumala: శ్రీవారి చెంత సముద్రపు హోరు.. అంతు చిక్కని తిరుమల ఆలయ రహస్యాలు.. ఆశ్చర్యపరిచే విషయాలు!
తిరుమల తిరుపతి గురించి తెలియని వారు ఉండరు.. కానీ తిరుమల ఆలయ రహస్యాలు ఇప్పటికీ కొన్ని మిస్టరీగానే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Fri - 23 May 25

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ప్రదేశం తిరుమల తిరుపతి. ఈ తిరుపతి ఆలయం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే ఈ ఆలయానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కూడా వస్తూ ఉంటారు.. ఎక్కడ లేని విధంగా ప్రతిరోజు స్వామి వారిని కొన్ని లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఆదాయం విషయంలో కూడా శ్రీవారి ఆలయం మొదటి స్థానంలో ఉందని చెప్పాలి. రోజు ఆదాయనే కొన్ని కోట్లలో ఉంటుందని చెప్పాలి. చాలామంది ఈ ఆలయానికి తరచూ వెళ్తూ ఉంటారు కానీ,కొన్ని రకాల ఆసక్తికర విషయాలు చాలా మందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడు అయిన వరాహ స్వామిని దర్శించుకోవాలి. స్వామివారి దర్శనం తరువాత తిరుపతిలో పద్మావతి, బీబీ నాంచారి, అలివేలు మంగ గోవిందరాజ స్వామి వారిని దర్శించుకోవాలి. ప్రతీ రోజూ లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వేంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభం కాదు. దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు. తిరుమలలోని గర్బగుడిలో ఉన్న శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఓకే రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కి.మీల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్థులు చాలా చాలా సంప్రదాయబద్దంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు. అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు.
కేవలం ఆ గ్రామానికి చెందినవారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాలట. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుందట. ఇది అస్సలు చిక్కు పడదని పోతున్నారు. అలాగే బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు గుణపంతో కొడతాడు. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సంప్రదాయంగా వస్తోంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది.స్వామివారు గర్భగుడి మధ్యలో వున్నట్లు కనిపిస్తారు. కానీ శ్రీవారు గర్భగుడి కుడి వైపునకు ఉంటారట. అలాగే స్వామి వారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుందట. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుందట. స్వామివారిని రోజూ కింద పంచె, పైన చీరతో అలంకరిస్తారట.
శ్రీవారి ఆలయంలో విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారట. ఆ పువ్వులను స్వామివారి వెనుక వైపు విసిరేస్తారట. ఆ పూలు తిరుపతికి దాదాపు 20 కిమీల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయట. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతున్నారు. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తేమగా ఉంటుందట. ఎన్నిసార్లు తుడిచినా కూడా తడి ఆరదు అని చెబుతున్నారు. స్వామి వద్ద ఉండే దీపాలు ఎప్పుడూ కొండ ఎక్కవట. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే అవి కొన్ని ఏళ్ల నుంచి అలాగే వెలుగుతూ వస్తున్నాయని చెబుతున్నారు. స్వామి వారి విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారీన్ హీట్ ఉంటుందట. అయితే ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారట. ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుందట.