Kubera Idols: కుబేరుడుని ఇంట్లో ఆ దిశలో పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
ఇంట్లో కుబేరుడి బొమ్మ పెట్టుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల నియమాలు పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:41 PM, Tue - 17 September 24

చాలామంది ఇంట్లో అలాగే వ్యాపార స్థలాల్లో కుబేరుడి బొమ్మను విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటారు. కుబేరుడు బొమ్మ ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, కుబేరుడు విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే కుబేరుడు విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం మంచిదే కానీ ముఖ్యంగా దిశలో గుర్తుంచుకోవడం అన్నది తప్పనిసరి అంటున్నారు పండితులు. మరి కుబేరుడు విగ్రహాన్ని ఏ దిశలో ఉంచితే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బౌద్ధమతాన్ని అనుసరించేవారు కుబేర బొమ్మను దైవంగా ఆరాధిస్తారు.
ఈ కుబేర బొమ్మ ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని, దురదృష్టాన్ని తొలగించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. మరి ఈ చిరునవ్వులు చిందిస్తున్న ఈ బొమ్మ మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించి మనల్ని ఆనందంగా ఉంచుతుందని చెబుతున్నారు. కుబేరుని బొమ్మ సకల బాధలను తొలగించి ఐశ్వర్యాన్ని, సంపదను తెస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది తమ ఇండ్లలో గొడవలు, కొట్లాటలు జరగకూడదని కూడా ఈ బొమ్మను పెడుతుంటారు. అయితే ఈ బెరుడి విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంతా మంచి జరగాలి అనుకుంటే అందుకు సరైన దిశను ఎంచుకోవడం తప్పనిసరి అంటున్నారు. దీనివల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుందట.
శత్రు భయం కూడా ఉండదని చెబుతున్నారు. మీ పని ప్రదేశంలో కుబేర బొమ్మను పెడితే పనిలో మీ శ్రేయస్సు, ఆదాయం పెరుగుతుంది. పిల్లలు చదివుకునే టేబుల్ పైన ఈ బొమ్మను పెడితే పిల్లలు చదువులో రాణిస్తారు. అలాగే పిల్లల్లో సోమరితనం పోతుందట.. ఇంట్లో కుబేర బొమ్మను తూర్పు దిక్కుకుగా పెట్టడం మంచిదట. ఈ దిశలో కుబేర బొమ్మను పెట్టడం వల్ల మీ ఇంట్లో సంతోషం, శాంతి కలుగుతాయి. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందట. అలాగే ఇంట్లో కుబేర బొమ్మను ఉత్తరం వైపున కూడా పెట్టవచ్చట. ఫలితంగా మీ ఇంట్లో శ్రేయస్సు, సంపద, శాంతి నెలకొంటాయి. అలాగే మీ ప్రతి పనిలో విజయం సాధిస్తారట. మీరు పడుకునే గదిలో లేదా డైనింగ్ రూం లో కుబేర బొమ్మను ఆగ్నేయ దిశలో ఉంచితే అదృష్టం కలుగుతుందట. అలాగే మీ ఇంటి ఆదాయం కూడా బాగా పెరుగుతుందని చెబుతున్నారు.