Lord Shani Blessings: శనివారం రోజు ఇవి చూస్తే చాలు.. శని అనుగ్రహంతో పాటు, కష్టాలన్నీ మాయం?
శనీశ్వరుడు.. హిందూమత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. మంచి పనులు చేసే వారికి శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
- By Anshu Published Date - 07:20 PM, Fri - 15 September 23

శనీశ్వరుడు.. హిందూమత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. మంచి పనులు చేసే వారికి శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.. చెడు పనులు చేసే వారిపై ఒక గంట కనిపెట్టడంతో పాటు వారిని ఎప్పటికప్పుడు శిక్షిస్తూ ఉంటాడు శని. చాలామంది శనేశ్వరుని గుడికి వెళ్లాలన్నా శనీశ్వరుని పేరు విన్న కూడా భయపడుతూ ఉంటారు. ఒకవేళ మీరు చేసే పనులతో శని దేవుడు సంతోషిస్తే మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. అందులో భాగంగానే శనివారం రోజున వీటిలో ఏ వస్తువులనైనా చూస్తే శనిదేవుడు మీకు అనుగ్రహం ఇస్తున్నాడని అర్థం.
అంటే మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. మరి శనివారం రోజున ఎటువంటి వస్తువులు చూస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు శనివారం రోజున తెల్లవారుజామున ఒక బిచ్చగాడిని చూసి, వారికి ఏదైనా దానం చేస్తే, అది మంచి సంకేంతంగా పరిగణించాలి. అప్పుడు మీకు శనిదేవుడు ప్రసన్నుడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు బిచ్చగాడికి మీ సామర్థ్యానికి తగినట్లుగా సహాయం చేయాలి. శనివారం రోజున ఉదయాన్నే చెత్త ఊడ్చే వ్యక్తులను లేదా చెత్త సేకరించే వ్యక్తులను చూసినా అది శుభప్రదంగా పరిగణించవచ్చు. అలాగే శనివారం రోజున మీ ఇంటికి ఎవరైనా స్కావెంబజర్లు వస్తే వారికి, మీ సామర్థ్యం మేరకు ఏదైనా దానం చేయడం వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అదేవిధంగా శనివారం రోజున శనీశ్వరుని ఆలయం నల్ల కుక్క కనిపిస్తే అది శుభప్రదంగా భావించాలి. దానికి ఆహారం ఇవ్వడం మంచిది. అలా చేయడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక శనివారం రోజున మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కాకి నీరు తాగడానికి వచ్చినా లేదా ఇంటి ముందు ఉంచిన నీటిని తాగినా అది శుభసూచకంగా పరిగణించవచ్చు. ఈ కాకిని చూసిన వ్యక్తికి శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శనివారం రోజున కాకి మీ తలని తాకితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడు మీపై కోపంగా ఉన్నాడని సంకేతం. శనివారం రోజున ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు నల్ల ఆవు ఎదురైతే వెళ్లే పని సక్రమంగా అవుతుందని భావించాలి.