Vastu Tips: ఇల్లు, ఆఫీస్ లలో వెండి ఏనుగు విగ్రహం పెడితే ఏం జరుగుతుందో తెలుసా?
భారతదేశంలో హిందువులు ఏనుగుని విఘ్నేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. అంతేకాకుండా హిందువులు ఎక్కువగా
- By Nakshatra Published Date - 06:00 AM, Mon - 13 February 23
భారతదేశంలో హిందువులు ఏనుగుని విఘ్నేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. అంతేకాకుండా హిందువులు ఎక్కువగా ఇష్టపడే జంతువులలో ఏనుగు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఏనుగు ఎవరికి కూడా హాని తలపెట్టదు. చాలామంది ఏనుగుని ఉంచడంతో పాటుగా ఏనుగును శుభం స్వచ్ఛతకు చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు. కాగా ఫెంగ్ షుయ్ శాస్త్ర ప్రకారము ఏనుగు విగ్రహం శుభప్రదం. వెండి ఏనుగును ఆఫీసులలో ఇళ్లలో పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెండి ఏనుగును ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
అలాగే వ్యాపారంలో వెండి ఏనుగు పెట్టుకోవడం వల్ల మంచి లాభం ఉంటుంది. కాగా ఆనందం, శ్రేయస్సు పొందడానికి, వెండి ఏనుగు విగ్రహాన్ని సరైన దిశలో ఉంచాలి. ఏనుగు పెద్ద జంతువు కాబట్టి ఏనుగును పెంచడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మీ ఇంటికి వెండితో చేసిన ఏనుగును తీసుకురావచ్చు. వాస్తు శాస్త్రం పరంగా వెండితో చేసిన ఏనుగు చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు. వెండి ఏనుగు రెండూ సానుకూలతను తీసుకురావడానికి పని చేస్తాయి.కెరీర్లో విజయం సాధించాలంటే ఏనుగు విగ్రహాన్ని స్టడీ రూమ్లో ఉంచాలి.
అలాగే ఆర్థిక శ్రేయస్సు కోసం ఇంట్లో అలాగే వ్యాపార ప్రదేశంలో ఏనుగు విగ్రహాన్ని ఉంచాలి. ఏనుగు విగ్రహాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి. అలాగే వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో పురోగతి కోసం, వెండి ఏనుగు విగ్రహాన్ని దుకాణం లేదా కార్యాలయంలో టేబుల్ పై ఉంచడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు రావడంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కాబట్టి వెండి ఏనుగు గ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి నుంచి బయట పడడంతో పాటుగా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.