Diwali 2025: దీపావళి పండుగ రోజు ఈ వస్తువులు మీ ఇంటికి తీసుకువస్తే చాలు.. మీకు తిరుగే ఉండదు!
Diwali 2025: దీపావళి పండుగ రోజున కొన్ని రకాల వస్తువులు ఇంటికి తీసుకు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని మీరు చేసే పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 AM, Wed - 15 October 25

Diwali 2025: మరికొద్ది రోజుల్లోనే దీపావళి పండుగ రాబోతోంది. ఈ దీపావళి పండుగ రోజున ఇంటిని చక్కగా దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని విగ్నేశ్వరుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఈరోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అయితే వారికి పూజ చేయడంతో పాటు వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. మరి దీపావళి రోజున ఎలాంటి వస్తువులు ఇంటికి తీసుకురావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇకపోతే వాస్తు ప్రకారం తాబేలుకు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం తెలిసిందే. ఈ తాబేలు ని విష్ణుమూర్తి చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి దీపావళికి ముందు లోహంతో తయారు చేసిన తాబేలు ను ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందట. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ల అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతున్నారు. దీపావళి పండుగ రోజున తీసుకువచ్చే తాబేలు ని మీ ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచాలట. అలాగే దీపావళికి ఒక రోజు ముందు మీరు ఇంటికి కొబ్బరికాయను తెచ్చుకోవాలట.
ఇలా చేయడం వల్ల ఇంటి లక్ష్మీదేవి వచ్చినట్లుగా పరిగణిస్తారు. తెచ్చిన కొబ్బరికాయను ఇంట్లో దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలట. తర్వాతి రోజు అంటే దీపావళి పండగ రోజున ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి సమర్పించాలట. దీని వల్ల ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉందని, అంతేకాకుండా శుభ ఫలితాలు కూడా కనిపిస్తాయని చెబుతున్నారు. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే దీపావళి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకురావడం చాలా మంచిది అని చెప్తున్నారు. తులసి మొక్క స్వచ్ఛతకు చిహ్నం. పాజిటివిటీని కూడా పెంచుతుంది. అలాగే ఇంట్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ మొక్కను తెచ్చుకొని ఇంట్లో ఈశాన్య దిశలో నాటాలట. రోజూ భక్తితో పూజిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు.