Friday: శుక్రవారం రోజు మహిళలు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!
మహిళలు శుక్రవారం రోజు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అని చెబుతున్నారు పండితులు. మరి ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:00 PM, Sun - 25 May 25

హిందువులు శుక్రవారం ని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఈరోజు లక్ష్మీదేవితో పాటు ఇంకా కొంతమంది అమ్మవార్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలకు శుక్రవారం అంటే చాలా ఇష్టం అని చెప్పాలి.. ఈరోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు చేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు మంచి ఫలితాలను అందిస్తాయని నమ్మకం. అలాగే లక్ష్మీదేవికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే శుక్రవారం రోజున మహిళలు పొరపాటున చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆ ఇంటికి దూరం అవుతుందట.
మరి ఇంతకీ మహిళలు శుక్రవారం రోజు ఎలాంటి పొరపాట్లను చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందువల్ల శుక్రవారం రోజున పూజ గది శుభ్రం చేసుకోవాలట. అయితే పూజగది శుభ్రం చేసిన తర్వాత ఆ చెత్తని బయటపడేయకూడదట. శుక్రవారం రోజున ఏ వస్తువు కూడా ఇంట్లో నుండి బయటకు విసిరేయకూడదట. శుక్రవారం రోజున చెత్త,పాత వస్తువులు బయట పడేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుందట. అంతేకాకుండా శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులపకూడదు అని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందట.
అయితే శుక్రవారం రోజున ఏవైనా వస్తువులు ఇంట్లోకి కొని తెచ్చుకోవటం మంచిదని ముఖ్యంగా ఉప్పు వంటివి కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం రోజు పూజ చేయడం కోసం మహిళలు తల స్నానం చేస్తూ ఉంటారు. కానీ ఇలా అసలు చేయకూడదట. మహిళలు శుక్రవారం రోజు తల స్నానం చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. శుక్రవారం రోజున తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుంది. అంతే కాకుండా శుక్రవారం రోజున పొరపాటున కూడా కుంకుమ కింద పడకుండా చూసుకోవాలని,కుంకుమ కింద పడితే అరిష్టం అని చెబుతున్నారు. అలాగే ఆ రోజున దేవుడు ముందు పెట్టిన పూలు కూడా వాడిపోకుండా చూసుకోవాలట. అంతే కాకుండా మహిళలు ఇంట్లో ఏడవటం కూడా అరిష్టమట. అందువల్ల మహిళలు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని వీటివల్ల లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు.