Kitchen: వంటగదిలో పదే పదే ఇలా జరుగుతుందో.. అయితే లక్ష్మికి ఆగ్రహం కలిగి సమస్యలు రావచ్చు.. జాగ్రత్త!
ఎంత జాగ్రత్తగా ఉన్నా వంట గదిలో పదేపదే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయా, అయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు కలగడం ఖాయం అంటున్నారు పండితులు.
- By Anshu Published Date - 12:00 PM, Wed - 21 May 25

మామూలుగా మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల ఇంట్లో సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తులు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ పొరపాట్లు ఎప్పుడో ఒకసారి జరిగితే తప్పులేదు కానీ తరచుగా ఈ పొరపార్లు జరిగితే లక్ష్మీదేవికి ఆగ్రహం రావచ్చట. అలాగే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం అంటున్నారు. తరచుగా ఎలాంటి పొరపాట్లు జరగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎప్పుడూ కూడా పదేపదే ఉప్పు చేయి జారి కింద పడిపోకూడదట. అప్పుడప్పుడు చాలా మంది చేతుల నుంచి ఉప్పు చేజారి కింద పడిపోతుంది. ఒకవేళ ఉప్పు కింద పడిపోవడం అన్నది పదే పదే జరుగుతున్నట్లయితే, ఇంట్లో ప్రతికూల శక్తి కలగవచ్చట. అలాగే ఇంట్లో ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కత్తులు మొదలైన పదునైన వస్తువులు చేజారి కింద పడిపోతున్నట్లయితే, అది ఆశుభానికి సంకేతంగా పరిగణించాలట. దాని వలన ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రతికూల శక్తి కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి పదునైన వస్తువులని జాగ్రత్తగా పట్టుకుంటే మంచిదని చెబుతున్నారు.
ఆవాల నూనె కూడా చేజారిపోవడం అంత మంచిది కాదట. ఆవాలనూనె చేజారి పోయినట్లయితే శనికి ఆగ్రహం కలుగుతుంది. జాతకంలో శని బలహీనమవుతాడని చెబుతున్నారు. అలాగే పదే పదే పాలు చేయి జారీ కింద పడిపోవడం కూడా అంత మంచిది కాదని చెబుతున్నారు. అలా జరిగితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. జాతకంలో శుక్రుడి స్థానం కూడా బలహీనంగా మారుతుందట. ఇలా జరగడం వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని, పేదరికం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.