Real Rudraksha : రియల్ రుద్రాక్షను గుర్తించేదెలా ?
మనదేశంలో మొత్తం 33 రకాల రుద్రాక్షలుండగా.. వాటిలో త్రిముఖి కంటే తక్కు, సప్తముఖి కంటే ఎక్కువ రుద్రాక్షలు నకిలీవి. రుద్రాక్షలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. గానిట్రస్ జాతికి చెందిన రుద్రాక్ష స్వచ్ఛమైనదిగా, ఎలియోకార్పస్ లాకునోసస్ జాతికి చెందిన రుద్రాక్షను నకిలీగా పరిగణించారు.
- By News Desk Published Date - 08:44 PM, Thu - 7 March 24
Real Rudraksha : హిందూ ధర్మాన్ని అనుసరించే వారంతా శైవారాధన తప్పనిసరిగా చేస్తారు. శివారాధన చేసేవారంతా రుద్రాక్షను నమ్ముతారు. ఆ పరమశివుడితో సంబంధం కలిగి ఉంటుంది రుద్రాక్ష. దీనిని ధరించేవారి గ్రహాలు, రాశులు మెరుగుపడతాయన్నది వారి నమ్మకం. శుభఫలితాలను పొందుతారు. రుద్రాక్షతో కొన్నిరకాల వ్యాధులు కూడా తగ్గుతాయని నమ్మకం. బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి కంట్రోల్ అవుతాయని విశ్వాసం. అయితే మార్కెట్లో ఇప్పుడు ప్రతిదానికి కల్తీ ఉంటుంది. అలాగే రుద్రాక్షకు డూప్లికేట్ కూడా అమ్ముడవుతున్నాయి. తెలియని వారు రియల్ రుద్రాక్ష అనుకునే ఎక్కువ డబ్బులు పెట్టి కొని మోసపోతున్నారు.
మతపరమైన దేశాల్లో నకిలీ రుద్రాక్షలు (భద్రాక్ష) అమ్ముతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. మనదేశంలో మొత్తం 33 రకాల రుద్రాక్షలుండగా.. వాటిలో త్రిముఖి కంటే తక్కు, సప్తముఖి కంటే ఎక్కువ రుద్రాక్షలు నకిలీవి. రుద్రాక్షలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. గానిట్రస్ జాతికి చెందిన రుద్రాక్ష స్వచ్ఛమైనదిగా, ఎలియోకార్పస్ లాకునోసస్ జాతికి చెందిన రుద్రాక్షను నకిలీగా పరిగణించారు. ప్లాస్టిక్ ఫైబర్ తో కృత్రిమ రుద్రాక్షను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంకొందరు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ తెలియకుండా ఉండేందుకు.. కలపను డిజైన్ గా మార్చి విక్రయిస్తున్నారు.
అసలైన రుద్రాక్షకు సహజంగా రంధ్రాలు ఉంటే.. డూప్లికేట్ లో విడిగా రంధ్రాలు చెక్కబడి కనిపిస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. రుద్రాక్షను ఆవనూనెలో ఉంచినపుడు దాని రంగును కోల్పోతే అది నకిలీ రుద్రాక్ష అని అర్థం. అలాగే ఒరిజినల్ రుద్రాక్ష నీటిలో మునిగితే.. డూప్లికేట్ రుద్రాక్ష నీటిలో తేలుతుంది.
ఒరిజినల్ రుద్రాక్షను ఏదైనా గోడపై లేదా పదునైన వస్తువుపై రుద్దితే దారంలాగా వస్తుంది. నకిలీ రుద్రాక్షను రుద్దితే కణాలు విరిగిపడతాయి. నాణ్యమైన రుద్రాక్ష నేపాల్ లో లభిస్తుంది. భద్రాక్షతో పోలిస్తే.. రుద్రాక్షపై అంచులు పదునుగా, గరుకుగా ఉంటాయి.
Also Read : Mahashivratri: మహాశివరాత్రి రోజు ఈ వస్తువులను సమర్పిస్తే చాలు.. అదృష్టం మారాల్సిందే?