Khairatabad Ganesh : ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి ఎత్తు ఎంతంటే..!!
ఈ ఏడాది వినాయక చవితి పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో 70 అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించనున్నారు
- Author : Sudheer
Date : 17-06-2024 - 9:05 IST
Published By : Hashtagu Telugu Desk
ఖైరతాబాద్‌లో మహాగణపతి (Khairatabad Ganesh) విగ్రహం ఏర్పాటు పనులు ఈరోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి. ముందుగా కర్రపూజ చేసి పనులు మొదలుపెట్టారు. ప్రతి ఏడాది నిర్మల ఏకాదశి రోజున గణపతికి కర్ర పూజ నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు ఏకాదశి కావడం తో మహాగణపతి పనులు స్టార్ట్ చేసారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
ఈ ఏడాది వినాయక చవితి పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో 70 అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించనున్నారు. ఖైరతాబాద్‌లో మహా గణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్టించారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతికి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గతేడాది ఇక్కడి వినాయకుడు 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా సరికొత్త రికార్డు సృష్టించాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక మనదేశంలో ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితి ప్రత్యేకతే వేరు. గణేష్ పండగ వస్తుందంటే చాలు ఊరు వాడ గణేష్ విగ్రహాలతో సందడి గా మారుతుంటాయి. దేశంలో గణేశ్ చతుర్థిని ఘనంగా జరుపుకునే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంటే ఆ తర్వాత స్థానంలో తెలంగాణలోని హైదరాబాద్ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్. గతేడాది ఇక్కడి గణపయ్య తన ఎత్తుతో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ రానుంది. గణేశ్ నవరాత్రుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను అత్యంత ఘనంగా జరిపేందుకు అంత ప్లాన్ చేస్తున్నారు.
Read Also : IPS Transfers : తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ