HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Hanuman Jayanti 2024 Kondagattu

Hanuman Jayanti : జై శ్రీరామ్ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు..

గురువారం ఉత్సవాలు ప్రారంభం కాగా, నేడు అంజన్న జయంతి కావటంతో అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు వేలాదిగా తరలించారు. మాలధారులు దీక్షా విరమణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు

  • Author : Sudheer Date : 01-06-2024 - 10:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hanuman Jayanthi2024
Hanuman Jayanthi2024

ఈరోజు పెద్ద హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్బంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. అలాగే జయంతి ఉత్సవాలు సైతం వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉత్సవాలు ప్రారంభం కాగా, నేడు అంజన్న జయంతి కావటంతో అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు వేలాదిగా తరలించారు. మాలధారులు దీక్షా విరమణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 2 లక్షల మంది దీక్ష విరమణ చేసినట్టు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ఉత్సవాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, భక్తులకు ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా… అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వాహణపై దృష్టి పెడుతున్నామని , కోనేరులో నీళ్లను ఎప్పటికప్పుడూ మార్చుతున్నట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం మధ్యాహ్నం వరకు దీక్షాపరుల రద్దీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పుణ్యక్షేత్రంలో మత సామరస్యం వెల్లివిరిసింది. భానుడి ప్రతాపాన్ని లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్న హనుమాన్ దీక్షా పరులకు ముస్లిం సోదరులు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లతో సేవలందించారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సిరాజుద్దీన్ మన్సూర్ తన సోదరులతో కలిసి కొండగట్టు పుణ్యక్షేత్రంలో హనుమాన్ దీక్షాపరులకు మజ్జిగ, మంచినీళ్లు ప్యాకెట్లను అందించారు. కాలినడకన మండుటెండలో కొండగట్టుకు చేరుకుంటున్న భక్తులకు ముస్లిం సోదరులు చేపట్టిన సేవ ఉపశమనం కలిగించింది.

Read Also : Telangana Formation Day : గన్‌పార్క్‌ చుట్టూ ఇనుప కంచె..ఇదేనా కాంగ్రెస్ ఇచ్చే గౌరవం – BRS


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hanuman jayanti
  • Kondagattu
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd