Goose Berry Tree : కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు, పూజలు ఎందుకు చేస్తారో తెలుసా?
హిందువులు అందరు కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు.
- Author : News Desk
Date : 18-11-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
కార్తీకమాసం(Karthika Masam)లో ఉసిరి చెట్టు(Goose Berry Tree) కింద హిందువులు అందరు వనభోజనాలు జరుపుకుంటారు. హిందువులు పండగలకు పెట్టిన ఏ ఆచారమైనా మన ఆరోగ్యానికి(Health) మంచి చేసేవే ఉంటాయి. అదే విధంగా హిందువులు అందరు కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. కార్తీకమాసంలో మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు.
దేవదానవ సంగ్రామం జరిగినప్పుడు కొన్ని అమృత బిందువులు కింద పడిన చోట ఉసిరి చెట్టు పుట్టిందని చెబుతారు. అందుకే అన్ని రకాల ఔషధ గుణాలు ఉసిరికాయలో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఔషధాల గని ఉసిరి. వృద్దాప్య ఛాయలు తగ్గించే గుణాలు ఉసిరిలో ఉన్నాయి. ఉసిరి చెట్టును ధాత్రీ వృక్షం అని, ఆరోగ్య సంజీవని అని అంటారు. ఉసిరి చెట్టు గాలి మన ఆరోగ్యానికి మంచిది.
కార్తీక మాసంలో ఉసిరి(Amla) చెట్టు కి పూజ చేసి ఈ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని చెబుతారు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణు మూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మ దేవుడు ఇంకా ఉసిరి చెట్టు ఆకులలో సకల దేవతలు ఉంటారని నమ్మకం. అందుకే ఉసిరి చెట్టుకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మరియు నాలుగు మూలాలు కలిపి మొత్తం ఎనిమిది చోట్ల దీపాలను వెలిగించుకుని చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షణలు చేసి చెట్టు నీడలో భోజనాలు చేయాలి.
ఉసిరి చెట్టు మన ఇంటిలో ఉంటే మన ఇంటిలోని దోషాలు తొలగిపోతాయి అని, నరదిష్ఠి తొలగిపోతుందని కొందరి నమ్మకం. ఉసిరికాయలను రోజుకొకటి చొప్పున సంవత్సరం మొత్తం తింటే మనకు ఎటువంటి వ్యాధులు రావని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఉసిరికాయను తినడం వలన చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది అది మన శరీరంలో రోగనిరోధకతను, శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. కాబట్టి కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనం, ఉసిరి పచ్చడి తినడం చేస్తే ఆరోగ్యం, పుణ్యం కూడాను.
Also Read : Karthika Masam : కార్తీకమాసంకి ఇంకొక పేరు కౌముది మాసం.. ఎందుకో మీకు తెలుసా?