Good Luck Idols: ధనవంతులు కావాలనుకుంటున్నారా.. అయితే ఇంట్లో ఈ విగ్రహాలు ఉంచండి?
Good Luck Idols: చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగల్లేదు అని నిరాశ చెందుతూ బాధపడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించమని పూజలు చేస్తూ దేవుళ్లను కోరుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఇంత కష్టపడి
- Author : Anshu
Date : 04-10-2022 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Good Luck Idols: చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగల్లేదు అని నిరాశ చెందుతూ బాధపడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించమని పూజలు చేస్తూ దేవుళ్లను కోరుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఇంత కష్టపడి పని చేసిన డబ్బు నిలవడం లేదు. పేదరిక మరింత వెంటాడుతోంది అని బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలకు వాస్తు ప్రకారంగా కూడా సమస్యలు ఉండవచ్చు. ఈ ఆర్థిక బయటపడాలి అంటే అన్ని రకాల వస్తువు నియమాలను పాటించాలి.
అందులో భాగంగానే కొన్ని విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం అష్టైశ్వర్యాలు కలిగి సుఖసంతోషాలతో ఉంటారు.. ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని పెట్టడం వల్ల, అది రాహు దోషాన్ని తొలగించడంతోపాటుగా అపారమైన సంపదను ఇస్తుంది. అంతే కాకుండా ఎప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే నివసిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని పెట్టడం వల్ల కెరియర్లో పురోగతి ఉంటుంది. వింది లేదా ఇత్తడి చేప విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం వల్ల మీకు రావాల్సిన డబ్బు కూడా అనేక మార్గాల ద్వారా వస్తుంది.
అదేవిధంగా ఇంట్లో విగ్రహం ఉండటాన్ని చాలామంది పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఏదైనా లోహంతో చేసిన తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చి దానిని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ తాబేలు విగ్రహాన్ని మీ డ్రాయింగ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మూడు విగ్రహాలను పైన చెప్పిన విధంగా ఆయా దిశలలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించడంతోపాటు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిగి ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది.