Undrallu: వినాయక చవితి స్పెషల్.. గణేష్ కి ఇష్టమైన ఉండ్రాళ్ల తయారీ విధానం?
వినాయక చవితి పండుగ వచ్చేసింది. రేపు అనగా సెప్టెంబర్ 18న వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే వినా
- By Anshu Published Date - 07:45 PM, Sun - 17 September 23

వినాయక చవితి పండుగ వచ్చేసింది. రేపు అనగా సెప్టెంబర్ 18న వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే వినాయక విగ్రహాలను బయట మండపంతో పాటు ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను చేసి పెడుతూ ఉంటారు. విగ్నేశ్వరుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళు. విఘ్నేశ్వరుడు ఎంతో ఇష్టంగా తింటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి వీటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉండ్రాళ్లకు కావలసిన పదార్థాలు:
బియ్యపు రవ్వ- 1 కప్పు
నీళ్ళు- 1 1/2 కప్పులు
శనగపప్పు- 1/2 కప్పు
జీలకర్ర – సరిపడా
నూనె – సరిపడా
ఉండ్రాళ్ల తయారీ విధానం:
ముందుగా ఒక మందపాటి గిన్నెలో నూనె వేసి కాగిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత దాంట్లో నీళ్లు పోసి ఉప్పు వేయాలి. మరిగిన తరవాత శనగపప్పు, బియ్యం రవ్వ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద ఉడికించాలి. దించే ముందు నెయ్యి వేయాలి. తర్వాత కిందకు దింపాలి. చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు చుట్టాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే గణేశునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు రెడీ.