Ganesh Chaturthi: ఎంతో సింపుల్ గా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకోవాలో మీకు తెలుసా?
దేశవ్యాప్తంగా భాషతో కులమత బేధాలతో సంబంధం లేకుండా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ
- By Nakshatra Published Date - 09:20 PM, Wed - 30 August 23
దేశవ్యాప్తంగా భాషతో కులమత బేధాలతో సంబంధం లేకుండా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీధి వీధికి ఒక వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిర్ణయించిన పూజలు చేస్తూ ఉంటారు. అయితే వీధిలో పెట్టే వినాయకులు మాత్రమే కాకుండా చాలామంది ఇంట్లో చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో వినాయకుడిని పెట్టి పూజించాలి అనుకునేవారు అందుకు ఎటువంటి నియమాలు పాటించాలి పూజా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఏడాది అనగా 2023లో సెప్టెంబర్ 19వ తేదీన వినాయక చవితి పండుగ వచ్చింది. మరి ఈ రోజున వినాయక విగ్రహానికి ఏ విధంగా పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజకు కావాల్సిన పూలు, పండ్లు, పత్రాలు, కొబ్బరికాయ, స్వామివారి విగ్రహం అన్నీ తెచ్చుకోవాలి. ముందుగా వినాయక పూజకు కావాల్సిన అన్ని సామాగ్రిని తెచ్చుకోవాలి. మట్టి గణపయ్య విగ్రహాన్ని కూడా ముందుగా తెచ్చి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా స్వామి వారికోసం ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మండపంపై వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం గణపతి పూజతో ప్రారంభించాలి. విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో దానికి సంబంధించిన శ్లోకాన్ని పఠించాల్సి ఉంటుంది. మూర్తి ప్రాణ ప్రతిష్ఠంతో చేసిన తరువాత స్వామివారి ముందు దీపారాదన చేయాలి. పండితులు మీ కోసం ఈ మొత్తం పూజలు చేస్తుంటే, గణేష్ కు నివాళి అర్పించే 16 రూపాలు అర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. మనసులోని కోరికను కోరుకోవచ్చు. తర్వాత 21 రకాల పత్రి, పూలతో స్వామివారిని పూజించాలి. ఎర్రటి కుంకుమను స్వామివారి విగ్రహానికి పెట్టాలి. పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టాలి. ఆ తర్వాత స్వామివారి వాహనమైన మూషికకు ధాన్యాలు పెట్టాలి. వినాయకుడి 108 శ్లోకాలు చదవడం మంచిది. పూజ మొత్తం భక్తి శ్రద్ధలతో చేయాలి.
అలాగే వినాయక చవితి రోజు కచ్చితంగా చదవాల్సిన శ్లోకం..
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకమ్..
భక్తావాసం స్మరేనిత్యం..
ఆయుష్కామార్థసిద్ధయే..
కేవలం ఈ శ్లోకం మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల శ్లోకాలు ఉన్నాయి. అయితే వాటిని పాటించకపోయినా ఈ ఒక్క శ్లోకాన్ని పాటించిన చాలు.
Related News
Raashi Khanna: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రాశి ఖన్నా.. ప్రత్యేకమైన పూజలు?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగశౌర్య, రామ్ పోతినేని,రవితేజ గోపీచంద